రవితేజ, రానా మల్టీస్టారర్ మూవీ..?

255
rana raviteja
- Advertisement -

ప్రస్తుతం టాలీవుడ్‌లో రీమేక్,మల్టీస్టారర్‌ సినిమాల హవా నడుస్తోంది. ఇప్పటివరకు తెలుగులో రీమేక్ చేసిన ఇతర భాషల సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. ఈ నేపథ్యంలో టాలీవుడ్ హీరోలు రీమేక్‌,మల్టీస్టారర్‌ సినిమాల వైపు చూస్తున్నారు. ఏ భాషలో ఐనా హీట్‌ టాక్‌ వినిపిస్తే చాలు ఆ మూవీలో రీమేక్‌లో నటించడానికి మన హీరోలు ఆసక్తి చూపిస్తున్నారు. ఇక టాలీవుడ్‌లో మల్టీస్టారర్‌ సినిమాలకు కూడా ఇప్పుడు యమా క్రేజ్‌ ఉంది. కాగా తాజాగా టాలీవుడ్ లో ఓ భారీ మల్టీస్టారర్​ మూవీ రాబోతున్నట్లు తెలుస్తోంది.

మాస్ మ‌హరాజ్ ​రవితేజ, రానా కలిసి మలయాళ సినిమా ‘అయ్యప్పనుమ్‌ కోశియుమ్‌’ రీమేక్​లో నటించనున్నట్లు సమాచారం. మలయాళంలో విడుదలై ఈమూవీ భారీ విజయాన్ని అందుకుంది. ఈ మూవీని తెలుగులో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మించనుంది. త్వరలోనే అఫిషియ‌ల్ ప్ర‌క‌ట‌న‌ వెలువడే అవకాశం ఉంది. లాక్‌డౌన్‌ పూర్తిగా ఎత్తేశాక ఈ రీమేక్‌ విషయమై ఓ స్పష్టత వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు ఏవరన్నది ఇంకా తెలియాల్సివుంది.

- Advertisement -