కనిపించని నెలవంక.. రేపే రంజాన్

447
crescent-moon
- Advertisement -

రంజాన్ పండుగను ఈ నెల 16న   జరుపుకోవాలని జామా మసీదు షహీ ఇమామ్ సూచించారు. ఇవాళ దేశవ్యాప్తంగా శవ్వాల్ నెలవంక కనిపించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. రేపు 30వ రోజు ఉపవాసాలు కొనసాగుతాయని తెలిపారు. ముస్లింలు పవిత్రంగా భావించే శుక్రవారం రోజు రంజాన్ పండుగ ఉంటుందని ఆశించారు. ఐతే, నెలవంక కనిపించకపోవడంతో శనివారం పండుగ జరుపుకోనున్నారు.

695260-eid

ముస్లిం సోదరులు నెల రోజులుగా చేస్తున్న రంజాన్ ఉపవాసాలకు ముగింపు పలికి ఈద్ ఉల్ ఫితర్ పండుగ జరుపుకుంటారు. ఈ సందర్భంగా వారు పెద్ద ఎత్తున దాన ధర్మాలు చేస్తారు. చంద్ర దర్శనాన్ని బట్టి ఒక్కో దేశంలో ఒక్కో రోజు రంజాన్ జరుపుకుంటారు. సింగపూర్, మలేషియాలో జూన్ 15న, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, భారత్‌లో రంజాన్ పండుగ రేపు జరుపుకుంటారు.

- Advertisement -