అదిరిపోయే లుక్స్ తో శివగామి…

317
ramya krishna
- Advertisement -

వయస్సు మీద పడుతున్న.. చూపుతోనే యువతరాన్ని మత్తేక్కించే సొగసరి ఆమె. అందచందాలతో కుర్రకారును కట్టిపడేసే 46 ఏళ్ల బొమ్మ రమ్యక్రిష్ణ. నాటి హీరోయిన్లలో అందగత్తెలు చాలా మందే ఉన్నారు. కానీ ఆ అందం చెక్కుచెదరకుండా నేటి తరాన్ని సైతం ఆకట్టుకునేలా ఉందిమాత్రం ఒక్క రమ్యకృష్ణ లో మాత్రమే.

ఇటీవల వచ్చిన బాహుబలి సినిమాలో శివగామిగా ఆమె అందం, అందానికి తగ్గ అభినయం చూసిన ప్రేక్షకులు రమ్యకృష్ణ ఇప్పటికీ బాగా ఆకట్టుకుంటోంది. ఇటీవల మ్యాగజైన్ కు ఇంటర్వ్యూ ఇస్తూ.. దిగిన ఫొటోలకు ఫిదా అయ్యారు అభిమానులు. మాగజైన్ కోసం ఇచ్చిన ఫోటో చూస్తే ప్రేక్షకుల మతిపోతుందట. ఈ వయసులో కూడా ఇంత అందమా..! అంటూ ఆశ్చర్యపోతున్నారట అంతా.

ఈ ఫోటోను రమ్యనే స్వయంగా తన ఫేస్ బుక్ ద్వారా అందరితో పంచుకుంది. ఇదంతా బాహుబలిలో తన పాత్ర పుణ్యమేనని పొంగిపోతుంది రమ్యకృష్ణ. ”నేను కలలో కూడా అనుకోలేదు నా జీవితంలో ఒక పాత్ర ఇంత ప్రభావం చూపిస్తుంది అని. బాహుబలి సినిమా నా కెరియర్ని గొప్ప మలుపు తిప్పింది. ఈ సినిమా ద్వారా పొందిన ఆనందాన్ని ఎప్పటికీ మరవలేను” అని చెబుతుంది ఆమె. బాహుబలి సినిమా తరువాత మళ్ళీ బాగ బిజీ అయ్యింది రమ్య కృష్ణ.

- Advertisement -