26 ఏళ్ల తర్వాత….చిరుతో విజయశాంతి !

653
chiranjeevi vijayashanthi
- Advertisement -

వెండితెరపై హిట్‌ పెయిర్‌లలో ఓ జోడి చిరంజీవి- విజయశాంతి. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ఎన్నో సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్‌లుగా నిలిచాయి. అద్భతమైన కామెడీ,సన్నివేశాలకు తగ్గట్టుగా సీన్‌ని రక్తికట్టించడంలో వీరికి వీరే సాటి. తాజాగా టీటౌన్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం 26 ఏళ్ల తర్వాత వీరిద్దరు కలిసి వెండితెరపై అలరించనున్నారట.

ఇందుకు చిరు 152వ మూవీ వేదిక కానున్నట్లు తెలుస్తోంది. సైరా తర్వాత చిరు…కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు. ఇక విజయశాంతి సైతం మహేష్ మూవీ సరిలేరు నీకెవ్వరుతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. ఇటీవలె సినిమా షూటింగ్‌లో పాల్గొన్న విజయశాంతిని చిరు మూవీలో తీసుకోవాలని దర్శకుడు భావిస్తున్నారట.

1993లో వచ్చిన మెకానిక్ అల్లుడు సినిమాలో చివరిసారిగా నటించారు. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన యుద్ధభూమి, యుముడికి మొగుడు, కొండవీటి దొంగ, సంఘర్షణ, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, గ్యాంగ్ లీడర్, మంచిదొంగ, కొండవీటి రాజా, పసివాడి ప్రాణం ఆల్‌ టైం హిట్‌ మూవీలుగా నిలిచాయి.

- Advertisement -