కాళేశ్వరంకు 33 జిల్లాల కలెక్టర్లు…

458
kaleshwaram project

రాష్ట్రంలోని 33 జిల్లాల కలెక్టర్లు ఈ నెల 28న(రేపు) కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. సీఎం కేసీఆర్ సూచనతో కాళేశ్వరం పర్యటనకు వెళ్లనున్న కలెక్టర్లు…వరంగల్‌కు చేరుకున్నారు.

రాత్రి వరంగల్‌లోనే బస చేయనున్న కలెక్టర్లు బుధవారం ఉదయం ముందుగా కాళేశ్వరం ముక్తీశ్వరస్వామిని దర్శించుకొనున్నారు. అనంతరం మహాదేవపూర్ మండలంలోని లక్ష్మీ (మేడిగడ్డ) బరాజ్‌ను సందర్శిస్తారు. తర్వాత కాళేశ్వరం సమీపంలోని లక్ష్మి (కన్నేపల్లి) పంప్‌హౌస్‌కు చేరుకుంటారు.

ఈ పంప్‌హౌస్‌లో మోటర్లు, గోదావరి నుంచి పంపుహౌస్‌లోకి చేరుకొనే అప్రోచ్ కెనాల్, పంప్‌హౌస్‌లోని మోటర్లు కన్నెపల్లి- అన్నారం గ్రావిటీ కెనాల్‌లో గోదావరి జలాలను పోసే డెలివరీ సిస్టర్న్‌ను పరిశీలించనున్నారు.

అనంతరం పెద్దపల్లి జిల్లాలోని బరాజ్‌లు, పంప్‌హౌస్‌లు, సర్జిపూల్స్‌ను సందర్శించి సాయంత్రం తిరిగి వెళ్లనున్నారు. రికార్డు స్థాయిలో మూడేళ్లలోనే నిర్మాణం పూర్తి చేసుకున్న కాళేశ్వరం ప్రాజెక్టును ప్రత్యక్షంగా చూడనున్నారు కలెక్టర్లు.