రామ్ ‘రెడ్’ నుంచి ఫస్ట్‌ సాంగ్..

582
ram red movie
- Advertisement -

టాలీవుడ్ ఎనర్జిటిక్‌ హీరో రామ్ పోతినేని నటిస్తున్న తాజా చిత్రం `రెడ్`. కిశోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమా శ్రీ‌ స్ర‌వంతి మూవీస్ ప‌తాకంపై స్ర‌వంతి ర‌వికిశోర్ నిర్మిస్తున్నారు. ఇదో స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ కం ల‌వ్ ఎంట‌ర్ టైన‌ర్.. ఆద్యంతం ఎమోష‌న్స్ ర‌క్తి క‌ట్టిస్తాయి. నిజ ఘ‌ట‌న‌ల ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమా ఏప్రిల్ 9న ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ‌వుతోంది.

red

ఈ సినిమా నుంచి ఒక లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేయడానికి ముహూర్తాన్ని ఖరారు చేశారు. ఈ నెల 6వ తేదీన సాయంత్రం 5 గంటలకు ‘నువ్వే నువ్వే’ అంటూ సాగే ఫస్టు సాంగ్ ను రిలీజ్ చేయనున్నారు. మణిశర్మ సంగీతాన్ని అందించిన ఈ పాటకి సిరివెన్నెల సాహిత్యాన్ని అందించగా, అనురాగ్ కులకర్ణి – రమ్య బెహ్రా ఆలపించారు. ఈ సినిమా యూత్ కి బాగా కనెక్ట్ అవుతుందనే టాక్ వినిపిస్తోంది. మాళవిక శర్మ .. నివేదా పేతురాజ్ ఈ సినిమాలో కథానాయికలుగా కనిపించనున్నారు.

- Advertisement -