బీరు సీసాలతో బిగ్‌బాస్ విన్నర్‌పై దాడి..

542
rahul
- Advertisement -

తెలుగు బిగ్‌బాస్-3 సీజన్‌ విన్నర్‌ రాహుల్ సిప్లిగంజ్‌పై బుధవారం రాత్రి బీరుబాటిళ్లతో దాడి జరిగింది.. పోలీసుల కథనం ప్రకారం.. రాత్రి 11:45 గంటల ప్రాంతంలో రాహుల్ తన స్నేహితులు, ఓ గాళ్‌ఫ్రెండ్‌తో కలిసి గచ్చిబౌలిలోని ఓ పబ్‌కు వెళ్లాడు. ఆ సమయంలో అక్కడున్న కొంతమంది యువకులు రాహుల్‌ వెంట వున్న యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. రాహుల్ కలగజేసుకోవడంతో మాట మాట పెరిగి.. ఇరు వర్గాల మద్య దాడి జరిగింది.

దాడిలో కొందరు యువకులు రాహుల్‌ తలపై బీరు సీసాలతో కొట్టారు.దీంతో రాహుల్ కి తీవ్ర రక్తస్రావమైంది. రాహుల్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. రాహుల్ సిప్లిగంజ్‌పై దాడికి పాల్పడింది ఎవరని పోలీసులు ఆరా తీస్తున్నారు.. ఇంతకీ రాహుల్ వెంట ఉన్నది ఎవరు అనేది పోలీసులు ఆరా తీస్తున్నారు. రాహుల్‌ వెంట ఉన్నది పునర్నవి లేదా వేరే ఎవరైనా ఉన్నారా అనేది తెలియాల్సి ఉంది. మొత్తానికి రాహుల్ పై బీరు బాటిల్‌తో దాడి చేయడం అనేది తెలుగు సినీ ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారింది.

- Advertisement -