రాష్ట్రపతి ఎన్నికలో రామ్ నాథ్ కోవింద్ ఘన విజయం సాధించారు. తన ప్రత్యర్థి, విపక్షాల అభ్యర్థి మీరాకుమార్ పై ఆయన 65.6శాతం ఓట్లతో ఘన విజయం సాధించారు. మొత్తం నాలుగు టేబుళ్లపై ఎనిమిది రౌండ్లలో చేపట్టిన ఈ ఓట్ల లెక్కింపులో ప్రక్రియలో కోవింద్ 7,02,044 ఓట్లు సాధించారు. రాష్ట్రపతిగా రామ్‌నాథ్ ఎన్నికైనట్టు లోక్‌సభ సెక్రటరీ జనరల్ అనూప్ మిశ్రా మీడియాకు అధికారికంగా వెల్లడించారు. ఈ నేపథ్యంలో, ఆయన భారత 14వ రాష్ట్రపతిగా బాధ్యతలను స్వీకరించబోతున్నారు. ఎన్డీఏ అభ్యర్థిగా రామ్‌నాథ్ కోవింద్, యూపీఏ అభ్యర్థిగా మీరాకుమార్ తలపడ్డ ఈ ఎన్నికల్లో కోవింద్ గెలుపు లాంఛనమే అయింది..
ఓట్ల లెక్కింపు ప్రకారం రామ్ నాథ్, మీరా కుమార్ కు వచ్చిన ఓట్ల వివరాలు…
అరుణాచల్ ప్రదేశ్: రామ్ నాథ్ – 448, మీరా కుమార్ – 24
ఆంధ్ర ప్రదేశ్: రామ్ నాథ్ – 27,189 , మీరా కుమార్ – 0
బీహార్: రామ్ నాథ్ కోవింద్ – 22,940, మీరా కుమార్ – 18,867
గోవా: రామ్ నాథ్ – 500, మీరా కుమార్ – 220
హిమాచల్ ప్రదేశ్: రామ్ నాథ్ -1,530 మీరా కుమార్ 1,087
జమ్ముకశ్మీర్: రామ్ నాథ్ -4,032, మీరా కుమార్ 20,160
అస్సాం: రామ్ నాథ్ – 10,556, మీరా కుమార్ – 4,060
కేవలం ఎన్డీయే కూటమిలోని పార్టీలు మాత్రమే గాక, ఎన్డీయేతర, తటస్థ పార్టీలు కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్‌కు మద్దతు పలికినప్పుడే ఆయన విజయం ఖాయమైంది. రాష్ట్రపతి ఎన్నికల్లో ఆయనే విజయం సాధిస్తారని.. యూపీఏ తరపు అభ్యర్థి మీరాకుమార్ పోటీ కేవలం నామమాత్రమే అని క్లారిటీ వచ్చింది.
776 మంది ఎంపీలు, 4,120 మంది ఎమ్మెల్యేలతో మొత్తం 4,895మంది అర్హులైన ప్రజాప్రతినిధుల్లో 99శాతం మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు. రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి ఇది రికార్డు పోలింగ్. కోవింద్‌కు దాదాపు 70శాతం ఓట్లు లభించవచ్చునని భావిస్తున్నారు.
ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవీకాలం జులై 24తో ముగియనుంది. దీంతో తదుపరి ప్రథమ పౌరుడి కోసం జులై 17న ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో 99శాతం ఓటింగ్ నమోదైంది. జులై 25న రామ్ నాథ్ కోవింద్ నూతన రాష్ట్రపతి ప్రమాణస్వీకారం చేయనున్నారు.