శీతాకాల విడిదికై రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ బొల్లారం నిలయానికి 20న రానున్నందున ఈ నెల 18లోపు ఏర్పాట్లను పూర్తిచేసి, నిర్ధేశిత విధులకు రిపోర్ట్ చేయాలని అధికారులకు జిహెచ్ఎంసి కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్ స్పష్టం చేశారు. మంగళవారం జిహెచ్ఎంసి కార్యాలయంలో విజిలెన్స్, ఎన్‌ఫోర్స్ మెంట్ విభాగం డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి, అడిషనల్ కమిషనర్లు అద్వైత్ కుమార్ సింగ్, శృతిఓజా, విజయలక్ష్మి, శానిటేషన్ జాయింట్ కమిషనర్ సుదాంష్, జోనల్ కమిషనర్ మమత, చీఫ్ వెటర్నరీ ఆఫీసర్ వెంకటేశ్వర్‌రెడ్డి, చీఫ్ ఎంటమాలజిస్ట్ డా.రాంబాబు, ఎస్.ఇ. అనిల్ రాజ్‌లతో రాష్ట్రపతి పర్యటన సందర్భంగా జిహెచ్ఎంసి ద్వారా చేసే ఏర్పాట్ల గురించి చర్చించారు.
బొల్లారం రాష్ట్రపతి నిలయం పూర్తిగా కంటోన్మెంట్ ఏరియాలో ఉన్నందున సంబంధిత అధికారులతో సమన్వయంతో వ్యవహరించాలని సూచించారు. దోమల నివారణకు స్ప్రేయింగ్, ఫాగింగ్ పనులను వెంటనే చేపట్టాలని ఎంటమాలజి అధికారిని ఆదేశించారు. యాంటి లార్వా పనులకు పెద్ద మిషన్ తో పాటు హ్యాండ్ హోల్డింగ్ మిషన్లు కూడా వినియోగించి పరిసరాలు మొత్తాన్ని కవర్ చేయాలని తెలిపారు. కంటోన్మెంట్ ద్వారా ఏర్పాటు చేస్తున్న 20 మొబైల్ టాయిలెట్లకు అదనంగా జిహెచ్ఎంసి ద్వారా 30 మొబైల్ టాయిలెట్లను నెలకోల్పి, నిరంతరం నీటి సదుపాయం కల్పించి, ప్రతిరోజు ఉదయం, సాయంత్రం సెప్టిక్‌ను క్లీన్ చేయించే బాధ్యతను కాంట్రాక్టర్‌కు అప్పగించాలని తెలిపారు.
ఈ నెల 18 నుండి 29వ తేదీ వరకు మొబైల్ టాయిలెట్ల నిర్వహణ ఉండేవిధంగా అగ్రిమెంట్‌లో పొందుపర్చాలని తెలిపారు. మొబైల్ టాయిలెట్లను పరిశుభ్రంగా నిర్వహించేందుకు మానిటరింగ్ చేయాలని తెలిపారు. అలాగే హకీంపేట ఎయిర్‌పోర్టులో కూడా మొబైల్ టాయిలెట్లను ఏర్పాటు చేయాలని తెలిపారు. రాష్ట్రపతి నిలయం పరిసరాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు స్వీపింగ్, గార్బేజ్ తొలగింపు పనులను వెంటనే పూర్తిచేయాలని తెలిపారు. పరిశుభ్రతను పెంచేందుకు ప్లాస్టిక్ వాడకాన్ని అరికట్టుటకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్యాకేజి ఫుడ్ ను అనుమతించరాదని తెలిపారు. వెటర్నరీ విభాగం ద్వారా డాగ్ టీమ్‌లు, మంకీ క్యాచింగ్, స్టే యానిమల్స్ తొలగింపు పనులను నిర్వహించుటకు శిక్షణ పొందిన సిబ్బందిని నియమించాలని తెలిపారు. గార్డెనింగ్‌కు, మొబైల్ టాయిలెట్లకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని తెలిపారు.
President Ramnath Kovind in Hyderabad on his Winter Sojourn…President Ramnath Kovind in Hyderabad on his Winter Sojourn…