రామ్ నగర్ బన్నీ..కంప్లీట్ ఎంటర్‌టైనర్

8
- Advertisement -

ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ హీరోగా నటిస్తున్న సినిమా “రామ్ నగర్ బన్నీ”. విస్మయ శ్రీ , రిచా జోషి, అంబికా వాణి, రితూ మంత్ర హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని దివిజ ప్రభాకర్ సమర్పణలో మలయజ ప్రభాకర్, ప్రభాకర్ పొడకండ నిర్మిస్తున్నారు. శ్రీనివాస్ మహత్ (వెలిగొండ శ్రీనివాస్) దర్శకత్వం వహిస్తున్నారు. అక్టోబర్ 4వ తేదీన “రామ్ నగర్ బన్నీ” సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర విశేషాలను తన ఇంటర్వ్యూలో తెలిపారు ‘ఆటిట్యూడ్ స్టార్’ చంద్రహాస్

– రామ్ నగర్ బన్నీ సినిమా కంప్లీట్ ఎంటర్ టైనర్. ఈ సినిమాను ప్రతి ఒక్కరూ బాగా ఎంజాయ్ చేస్తారు. ఇలా అన్ని ఎలిమెంట్స్ ఉన్న సినిమా నా డెబ్యూ మూవీ కావడం సంతోషంగా ఉంది. ఇలాంటి ఎంట్రీ మరొకరికి దొరుకుందని అనుకోను. మరికొద్ది గంటల్లో సినిమా రిలీజ్ కు వస్తోంది. రిలీజ్ డేట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి ఎగ్జైటింగ్ గా ఉన్నాను. అయితే సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుందనే కాన్ఫిడెన్స్ మా టీమ్ అందరిలో ఉంది.

– నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రామ్ గోపాల్ వర్మ గారు నా గురించి హీరో క్వాలిటీస్ అన్నీ ఉన్నాయని చెప్పడం సంతోషంగా ఉంది. అలాగే మా “రామ్ నగర్ బన్నీ” సినిమా చూసి మీకు నచ్చకుంటే నాకు మీ టికెట్ ఫొటోతో ఇన్ స్టా ద్వారా చెప్పండి మీ డబ్బులు తిరిగి ఇచ్చేస్తా అని చెప్పాను. సినిమా మీద నమ్మకంతోనే అలా అన్నాను.

– “రామ్ నగర్ బన్నీ” సినిమాలో నేను సూపర్ హీరోలా కనిపించను. ఒక సాధారణ యువకుడిగానే కనిపిస్తా. నేను తిట్లు తింటాను, అవమానాలు ఎదుర్కొంటాను. రకరకాల జాబ్స్ చేస్తాను. కొన్నిసార్లు జాబ్ లెస్ గా ఉంటాను. అన్నిరకాల ఎమోషన్స్ చేసే అవకాశం ఈ చిత్రంలో కలిగింది.

Also Read:మంత్రి కొండాకు నాగ్ లీగల్ నోటీసులు!

– “రామ్ నగర్ బన్నీ” సినిమాను సకుటుంబంగా ఫ్యామిలీ ఆడియెన్స్ వెళ్లి చూడొచ్చు. ఒక పాటలో ముద్దు సీన్స్ ఉండేవి. అయితే అవి సెన్సార్ లో కట్ చేయించాం. కిస్సింగ్ సీన్స్ సినిమాలో ఉండవు. నలుగురు హీరోయిన్స్ ఉన్నారు మా మూవీలో. వాళ్ల క్యారెక్టర్స్ కు పర్ ఫార్మెన్స్ పరంగా మంచి స్కోప్ ఉంటుంది. అలాగే వాళ్లు అందంగా కనిపిస్తారు. నలుగురు హీరోయిన్స్ ను కథానుసారమే మా మూవీలో తీసుకున్నాం.

– “రామ్ నగర్ బన్నీ” సినిమాను మా నాన్నగారు ప్రభాకర్ ప్రొడ్యూస్ చేశారు. ముందు నేను వద్దనే అన్నాను. ప్రొడక్షన్ రిస్క్ ఉంటుంది. అయితే ఈ కథను మనం అనుకున్నట్లు బాగా చేయాలంటే మనమే ప్రొడ్యూస్ చేయాలని నాన్న ముందుకొచ్చారు. నాన్న ఈ సినిమాలో ఓ చిన్న రోల్ చేశారు. ఆ టైమ్ కు ఆర్టిస్టు అందుబాటులో లేకుంటే నేనే చేస్తా అని నాన్న అన్నారు.

– దర్శకుడు శ్రీనివాస్ మహత్ నన్ను స్క్రీన్ మీద బాగా ప్రెజెంట్ చేశాడు. ఫైట్స్, డ్యాన్స్, లవ్, ఎమోషన్, రొమాంటిక్ ఇలా..అన్ని షేడ్స్ లో నన్ను చూపించారు. ఈ సినిమా తర్వాత నేను అన్ని ఎమోషన్స్, అన్ని జానర్స్ చేయగలను అనే పేరొస్తుంది. ఆటిట్యూడ్ స్టార్ అనేది నేను పెట్టుకున్నది కాదు. “రామ్ నగర్ బన్నీ” సినిమా చూశాక నేను ఆ ట్యాగ్ కు అర్హుడిని కాదు అంటే తీసేస్తా.

– నన్ను ట్రోల్ చేసే వారి గురించి ఇప్పటికే నా అభిప్రాయం చెప్పాను. ట్రోల్స్ వల్ల నేను పెద్దగా బాధపడలేదు. వాటిని పాజిటివ్ గా తీసుకున్నా. నేను సినిమాలు చేసేది నన్ను ఇష్టపడే ప్రేక్షకుల కోసం. వారికి నా నటన నచ్చితే చాలు అనుకుంటున్నా. మూ మూవీకి అశ్విన్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. అతను అనిరుధ్ లా గుర్తింపు తెచ్చుకుంటాడని చెప్పగలను.

– నాకు ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయాలని ఉంది. మంచి నటుడిగా పేరు తెచ్చుకోవాలి. అవకాశం వస్తే అన్ని జానర్ మూవీస్ లో నటిస్తా. ప్రస్తుతం మూడు చిత్రాల్లో నటిస్తున్నా. వాటి వివరాలు త్వరలో వెల్లడిస్తా

- Advertisement -