శ్రీరెడ్డి ట్వీట్‌ చూసి..వర్మ షాక్‌..!

241
- Advertisement -

‘క్యాస్టింగ్‌ కౌచ్’ ….ఈ పేరు గత కొన్నిరోజులుగా టాలీవుడ్‌లో సెన్సేషల్‌ టాపిక్‌గా మారింది. ఈ పేరుతో అమ్మాయిలను ఇష్టమొచ్చినట్టుగా వాడుకుంటూ..అవకాశాలు కూడా ఇవ్వడంలేదంటూ శ్రీరెడ్డి కొన్ని రోజులుగా పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే.

Ramgopal Varma tweet about srireddy

ఈ క్రమంలోనే శ్రీరెడ్డి పోరాటం నేషనల్‌ వైడ్‌గా చర్చకు తావిచ్చింది. ఇదిలాఉంటే తాజాగా ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ వాకాడ అప్పారావు గురించి ట్వీట్ చేసింది. ”వాకాడ అప్పారావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్.. ఇతను సెక్సువల్‌గా అబ్యూజ్ చేయడమే కాకుండా 16 సంవత్సరాల బాలికలతో సహా వందల మంది అమ్మాయిలను ఛాన్సుల పేరుతో వాడుకున్నాడు. మెగాస్టార్ చిరంజీవి గారు ఇతను మీ పేరు చెప్పుకుని ఎంతో మంది ఆడవారి జీవితాలను నాశనం చేశాడు. దయచేసి ఇటువంటి వారిని ప్రోత్సహించకండి” అంటూ ట్వీట్ చేసింది.

అయితే శ్రీరెడ్డి ట్వీట్ పై రామ్‌గోపాల్‌ వర్మ స్పందించారు. వాకాడ అప్పారావు నిజస్వరూపం తెలుసుకొని ఒక్కసారిగా షాకయ్యానంటూ తెలిపారు. అంతేకాకుండా మానవతా హృదయం కలిగిన వ్యక్తులంతా అతని కారణంగా లైంగిక వేధింపులకు గురైన బాధితులను కలుసుకొని అతని అమానుష చర్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్ళి..బాధితులకు న్యాయం జరిగేలా చూడాలంటూ వర్మ ట్వీట్‌ చేశారు. కాగా వర్మ ట్వీట్‌పై కొంతమంది నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

- Advertisement -