సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ హీరో కింగ్ నాగార్జున కాంబినేషన్ తెరకెక్కిన చిత్రం ఆఫీసర్. 25సంవత్సరాల మధ్య విరిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తుండటంతో ప్రేక్షకుల్లో భారీ అంచానాలు ఉన్నాయి. ఇటివలే విడుదలైన ఈసినిమా ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తుంది. ముంబాయ్ జరిగే క్రైం ను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను నిర్మించినట్టు తెలుస్తుంది. ఇటివలే రాం గోపాల్ వర్మపై వైటీ ఎంటర్ టైన్ మెంట్ సంస్ధకు ఉన్న వైరాన్ని తొలగించుకున్నాఉ వర్మ. తమ సంస్ధకు వర్మ రూ. 1.06 కోట్లు బకాయి ఉన్నాడని ఆసంస్ధ కోర్టును ఆశ్రయించింది.
దీంతో మొదటిసారి వర్మ కోర్టుకు హాజరుకాకపోగా…ఆగ్రహం వ్యక్తం చేసిన జడ్జి సినిమా విడుదలను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈనెల 18వ తేదిలోపు డబ్బులు చెల్లించాలని తెలిపారు. సినిమా విడుదలను ఆపివేయడంతో వర్మ తరువాతి విచారణకు కోర్టులో హాజరయ్యాడు. అనంతంరం కోర్టు తీర్పు మేరకు వైటీ ఎంటర్ టైన్ మెంట్ కు బాకీ ఉన్న మొత్తం బకాయిలను తీర్చేసి కన్సెంట్ ఆర్డర్ పై సంతకం చేశారు వర్మ. అయితే మొదటగా ఈసినిమాను ఈనెల 25వ తేదిన విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన వర్మ ఇప్పుడు ఆతేదిని మార్చి వేశారు. జూన్ 1వ తేదిన ఈసినిమాను విడుదల చేయనున్నట్లు తెలిపారు. పలు సాంకేతిక కారణాల వల్ల ఈసినిమాను వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. తమ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు వర్మ. ఈసినిమాకు వర్మ ప్రోడ్యూసర్ గా వ్యవహరించారు.