రాజ‌మౌళి సినిమాలో ఛాన్స్ కొట్టేసిన మ‌హాన‌టి..

225
Is Mahanati landing Keerthy Suresh SS Rajamouli's multi-starrer RRR?
- Advertisement -

కిర్తి సురేష్ చేసింది త‌క్కువ సినిమాలే అయినే ఆమె పేరు మాత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా వినిపిస్తుంది. అల‌నాటి అందాల తార సావిత్రి జీవిత‌క‌థ ఆధారంగా తీసిన బ‌యోపిక్ లో ఆమె సావిత్రి పాత్ర‌లో న‌టించి అంద‌రి మ‌న్న‌న‌న‌లు అందుకుంది. సినిమా చూస్తుంటే అల‌నాటి న‌టి సావిత్రి దిగి వ‌చ్చిన‌ట్టు సంబ‌ర ప‌డిపోయారు ప్రేక్ష‌కులు. ఈసినిమా దేశ వ్యాప్తంగా మంచి వ‌సూళ్ల‌ను రాబుడుతుంది. ఈసినిమాతో కిర్తి సురేష్ టాలీవుడ్ హీరోయిన్ ల‌లో టాప్ రేంజ్ కు ఎదిగిపోయింది. ఈసినిమా ప్ర‌ముఖ‌లు నుంచి మంచి ప్ర‌శంస‌లు అందుకుంది. కిర్తి సురేష్ న‌ట‌న‌తో అంద‌రిని మైమ‌ర‌పించిన విష‌యం తెలిసిందే.

Is Mahanati landing Keerthy Suresh SS Rajamouli's multi-starrer RRR? ఈసినిమాతో మ‌రోసారి తెలుగు సినీ పరిశ్ర‌మ స‌త్తాను ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేశారు. తెలుగు వ‌చ్చిన మొట్ట‌మెద‌టి బ‌యోపిక్ కావ‌డంతో ప్రేక్ష‌కుల్లో మంచి ఆద‌ర‌ణ ల‌భించింది. ఇక ఈసినిమాతో కిర్తి సురేష్ కు మంచి మంచి ఆఫ‌ర్లు వ‌స్తుయంట‌. పెద్ద పెద్ద నిర్మాణ సంస్ధ‌లు సైతం కిర్తి సురేష్ ను సంప్ర‌దిస్తున్నార‌ని స‌మాచారం. ఇప్పుడు అంద‌రి చూపే కిర్తి సురేష్ పైనే ప‌డింది. కిర్తి సురేష్ త‌ర్వాతి సినిమా ఎవ‌రితో న‌టిస్తుంద‌నే వార్త ఇప్పుడు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తుంది. ఇక ఇటివ‌లే ఈసినిమా చూసిన ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి కిర్తి సురేష్ పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురింపించిన విష‌యం మ‌నంద‌రికి తెలిసిందే.

ఇక రాజ‌మౌళి తెరకెక్కిస్తున్న మ‌ల్లిస్టార‌ర్ సినిమాలో కిర్తి సురేష్ ను ఒక‌ హీరోయిన్ గా తీసుకొవాల‌నే ఆలోచ‌న ఉన్న‌ట్టు స‌మాచారం. ఇందుకు కిర్తి సురేష్ ను కూడా సంప్ర‌దించాడ‌నే వార్త ఫిలిం న‌గ‌ర్ వ‌ర్గాల్లో చక్క‌ర్లు కొడుతుంది. ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి సినిమాలో కిర్తి సురేష్ హీరోయిన్ గా న‌టిస్తే ఆమె బంప‌ర్ ఆఫ‌ర్ కొట్టిసిన‌ట్టే చెప్పుకొవ‌చ్చు. ఇక కిర్తి సురేష్ ప‌లు బ‌యోపిక్ ల‌లో న‌టించే అవ‌కాశం వ‌చ్చిన‌ట్టు కూడా తెలుస్తుంది. ఎన్టీఆర్ బ‌యోపిక్ లో అలాగే జ‌య‌ల‌లిత బ‌యోపిక్ ల‌లో కూడా కిర్తి సురేష్ ను సంప్ర‌దించిన‌ట్టు స‌మాచారం.

- Advertisement -