దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టుకు మరోసారి క్షమాపణ చెప్పారు పతాంజలి రాందేవ్ బాబా. ప్రజలను తప్పుదోవ పట్టించేలా ప్రకటనలు ఇచ్చి, ఆపై సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించిన పతంజలిపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక చిన్న చిన్న అక్షరాలతో సుప్రీం సూచనల ప్రకారం ప్రకటన ఇవ్వగా దీనిపై మళ్లీ ఆగ్రహం వ్యక్తం చేసింది న్యాయస్థానం.
దీంతో ఇవాళ మరోసారి క్షమాపణలు కొరుతూ అన్ని పత్రికల్లో తాటికాయంత అక్షరాలతో ప్రకటనలు ఇచ్చింది. పతంజలి ఎండీ బాలకృష్ణ పేరుతో ఈ బహిరంగ క్షమాపణలకు సంబంధించి ప్రకటన రిలీజ్ చేసింది పతంజలి.
సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో కోర్టు ఆదేశాలు పాటించనందుకు/ ఉల్లంఘించినందుకు వ్యక్తిగత హోదాతోపాటు కంపెనీ తరపున తాము బేషరుతుగా క్షమాపణలు చెబుతున్నట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కేసులో తదుపరి విచారణ ఈ నెల 30న జరగనుండగా ఆరోజు కోర్టుకు హాజరుకావాలని రాందేవ్ బాబా,బాలకృష్ణలనే ఆదేశించిన సంగతి తెలిసిందే.
Also Read:NBK109..హంటర్ వచ్చేశాడు!