అనసూయ కోసం.. పవర్ స్టార్‌ వెయిటింగ్‌..!

197
- Advertisement -

తెలుగు బుల్లితెరపై హాట్ యాంకర్ గా దూసుకుపోతోంది అనసూయ. బుల్లి తెరపై చాలామంది యాంకర్లు గా కెరియర్‌ మొదలుపెట్టి కొద్దికాలానికే.. సినిమాలో ఛాన్స్‌ రావడంతో యాంకరింగ్‌కి గుడ్‌బై చెప్పేస్తారు.

కానీ యాంకర్‌ అనసూయ మాత్రం అటు బుల్లి తెరపై అలరిస్తునే ఇటు వెండితెరపై కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంటుంది. బుల్లితెరపై తనదైన స్టైల్‌లో యాంకర్‌గా దూసుకుపోతు అలాగే వెండి తెరపై కూడా నచ్చిన పాత్రలు వచ్చినప్పుడల్లా ఆమె మెరుస్తూనే వుంది. ఇదే క్రమంలో టీవీ న్యూస్ యాంకర్ గా వెలుగులోకి వచ్చిన ఈమె ఇప్పుడు స్టార్ హీరోలు వెయిట్ చేసేంత స్థాయికి ఎదిగింది.

 ramcharan waiting for anasuya

ఇదిలా ఉంటే..మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ హీరోగా రూపొందుతున్న ‘రంగస్థలం’ సినిమాలో అనసూయ పార్టు షూటింగ్ పెండింగ్ లో ఉంది. సినిమాలో ఈమెది ఒక కీలకపాత్ర అని తెలుస్తోంది. అందుకు సంబంధించి సీన్ల షూటింగ్ కోసం చరణ్, సుకుమార్ లు వేచి చూస్తున్నారట.

బిజీ బిజీగా ఉన్న అనసూయ త్వరలోనే ‘రంగస్థలం’ షూటింగ్ లో పాల్గొననున్నదని సమాచారం. మరి ఇది వరకూ నాగార్జున వంటి పెద్ద హీరోతో స్క్రీన్ ను షేర్ చేసుకున్న అనసూయ చరణ్ సినిమాలో ఎలాంటి పాత్రలో కనిపిస్తోందో అనేది ఆసక్తికరంగా ఉంది. అలాగే మంచువిష్ణు సినిమాలో కూడా ఒకపాత్ర కోసం అనసూయతో సంప్రదింపులు జరుగుతున్నాయని సమాచారం. దర్శకుడు మదన్.. మంచు విష్ణుతో సినిమాతో రీఎంట్రీ ఇవ్వనున్నాడట. అందులో అనసూయను ఒక ముఖ్యపాత్రకు అనుకుంటున్నారని సమాచారం.

- Advertisement -