ట్విట్టర్ కు పోటీగా మెటా సంస్థ తీసుకొచ్చిన ‘థ్రెడ్స్’ యాప్ అకౌంట్ హోల్టర్స్‌తో దూసుకుపోతుంది. ఈ యాప్‌లో పలువురు టాలీవుడ్ హీరోలు జాయిన్ అయ్యారు. వారిలో మహేష్ బాబు, అల్లు అర్జున్, జూ.ఎన్టీఆర్, రామ్ పోతినేని, విజయ్ దేవరకొండ లాంటి స్టార్ హీరోలు ఉన్నారు. దీంతో ఆయా హీరోల అభిమానులు వారిని ఫాలో చేసేందుకు రెడీ అవుతున్నారు. తాజాగా ‘థ్రెడ్స్’లోకి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అడుగుపెట్టారు. @alwaysramcharan అకౌంట్‌తో ఆయన అధికారంగా రంగ ప్రవేశం చేశారు.
ఈ విషయం తెలుసుకున్న మెగా అభిమానులు థ్రెడ్స్‌లో ఆయనను ఫాలో కావడం ప్రారంభిస్తున్నారు. అయితే, ప్రస్తుతం హీరోల అందరిలో కల్లా అల్లు అర్జున్‌కే అత్యధిక(121K) ఫాలోవర్లు ఉన్నారు. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు సైతం పోటీ పడి మరీ తమ హీరో ఫాలోవర్లను పెంచుతున్నారు. అదే విధంగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ సైతం పోటీ పడుతున్నారు. ఇదే క్రమంలో మిగిలిన హీరోల అభిమానుల శైలి ఉంది.
Also Read:గుజరాత్ హైకోర్టులో రాహుల్‌కి నిరాశే
మొత్తమ్మీద మార్క్ జుకర్ బర్గ్ నేతృత్వంలోని మెటా సంస్థ.. ట్విట్టర్ కు పోటీగా థ్రెడ్స్ ను తీసుకొస్తే.. ఇక్కడ టాలీవుడ్ లో హీరోల అభిమానుల మధ్య పోటీ పెరిగింది. మరోవైపు థ్రెడ్స్ కూడా జనంలోకి బాగా వెళ్తుంది. కేవలం కొద్ది గంటల్లోనే థ్రెడ్స్ లో అరకోటికి పైగా అకౌంట్స్ ఓపెన్ చేశారు. రానున్న 24 గంటల్లో కోట్ల సంఖ్యలో అకౌంట్స్ ఓపెన్ చేసే అవకాశం ఉంది. అప్పుడు కచ్చితంగా ట్విట్టర్ హవా తగ్గుతుంది.
Also Read:బీజేపీ దారిలోనే కాంగ్రెస్.. టోటల్ ఛేంజ్?