మ‌రోసారి చెర్రీ సినిమాలో ర‌కుల్..

388
ram charan, rakul preet singh
- Advertisement -

రంగ‌స్ధ‌లం సినిమాతో త‌న కెరీర్ లోనే భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌. ప్ర‌స్తుతం రామ్ హీరోగా బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌కత్వంలో ఓ సినిమా చేస్తోన్నాడు. యాక్ష‌న్ ఎంటర్టైన‌ర్ గా ఈసినిమాను తెర‌కెక్కిస్తోన్నారు. ఈ మూవీలో చెర్రీ కొత్త గెట‌ప్ లో క‌నిపించ‌నున్నాడు. ప్ర‌స్తుతం ఈసినిమా షూటింగ్ శ‌రవేగంగా జ‌రుగుతోంది. ఈమూవీని ద‌స‌రాకు విడుద‌ల చేసేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తోన్నారు ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు.

RamCharan, BoyapatiSrinu

బోయ‌పాటి శ్రీను సినిమాల్లో ఐటెం సాంగ్ కు ప్ర‌త్యేక స్దానం ఉంటుంది. ఇప్పుడు రామ్ చ‌ర‌ణ్ సినిమాలో కూడా ఓ ప్ర‌త్యేక సాంగ్ ఉండ‌నుంద‌ని స‌మాచారం. బోయ‌పాటి త‌న సినిమాల్లో స్టార్ హీరోయిన్ల‌తో ఐటెం సాంగ్ ల‌ను చేయిస్తోంటాడు. ఈసంద‌ర్భంగా రామ్ చ‌ర‌ణ్ బోయ‌పాటి సినిమాలో కూడా ఓ స్టార్ హీరోయిన్ ఐటెం సాంగ్ చేయ‌నుంద‌ని ఫిలిం న‌గ‌ర్లో చ‌క్క‌ర్లు కొడుతోంది.

Ram-Charan, rakul

బోయ‌పాటి, రామ్ చ‌ర‌ణ్ సినిమాలో స్టార్ హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్ ఐటెమ్ సాంగ్ లో క‌నిపించ‌నుంద‌ని తెలుస్తోంది. అందుకు ర‌కుల్ కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసింద‌ని స‌మాచారం. ఇక రామ్ చ‌ర‌ణ్ తో ర‌కుల్ ప్రీత్ సింగ్ బ్రూస్ లీ, ధృవ సినిమాలో న‌టించింది. బోయ‌పాటి శ్రీను తో జ‌య జాన‌కి నాయ‌క సినిమాలో హీరోయిన్ గా న‌టించింది. ఈ సినిమాలో ఐటెం సాంగ్ లో న‌టించి ఏ మేరకు అల‌రిస్తోందొ చూడాలి.

- Advertisement -