రణ్బీర్ కపూర్, సాయి పల్లవి, యశ్ ప్రధాన పాత్రల్లో నటించిన భారీ బడ్జెట్ చిత్రం ‘రామాయణం: పార్ట్ 1’ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. విడుదలైన మొదటి వారంలోనే రూ.931 కోట్ల వసూళ్లను రాబట్టి వెయ్యి కోట్ల దిశగా దూసుకెళ్తోంది. బుధవారం దేశవ్యాప్తంగా 24,239 షోలతో ఈ సినిమా 43.4 శాతం ఆక్యుపెన్సీ నమోదు చేసింది.
దీంతో మొదటి ఏడు రోజుల్లో భారత్లో సినిమా నెట్ కలెక్షన్లు రూ.511.10 కోట్లకు చేరాయి. గ్రాస్ వసూళ్లు రూ.611.05 కోట్లుగా నమోదయ్యాయి. ఇక పంచవ్యాప్తంగా మొత్తం రూ.934.55 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది.
ప్రపంచవ్యాప్తంగా ‘రామాయణం’ సినిమా వసూళ్ల పరంగా మరో ప్రత్యేకతను సొంతం చేసుకుంది. విడుదలైన మొదటి ఏడు రోజులూ ప్రతిరోజూ రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. ఏడో రోజు వసూళ్లలో హిందీ వెర్షన్ అగ్రస్థానంలో నిలిచింది. హిందీలో రూ.58 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. కన్నడలో రూ.4.50 కోట్లు, తెలుగు, మలయాళంలో చెరో రూ.2.75 కోట్లు, తమిళంలో రూ.2.65 కోట్ల వసూళ్లు నమోదయ్యాయి.
Also Read:విశాఖ వేదికగా ‘CII సదస్సు’-2026
ఇక ఈ సినిమా రెండో భాగం రామాయణం: పార్ట్ 2.. 2028 దీపావళి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

