రాజకీయం కాదు,జవాబు చెప్పు..రేవంత్‌పై రామారావు ఫైర్

223
Ramarao on Revanth Corruption
- Advertisement -

రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఇళ్లపై దాడులు జరుపుతున్నామని చెప్పడం సరైంది కాదన్నారు లాయర్ రామారావు. రేవంత్ అక్రమాస్తులకు సంబంధించి రెండు నెలలుగా వివరాలు సేకరించానని తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదన్నారు.

రేవంత్‌పై తాను ఫిర్యాదు చేసింది గొరంత మాత్రమేనని…కానీ ఐటీ అధికారుల దాడుల్లో బయటపడుతుంది కొండం అని చెప్పారు. 19 డొల్ల కంపెనీల ద్వారా రూ. 400 కోట్ల అక్రమార్జనకు పాల్పడ్డారని ఆధారాలతో కలిసి ఫిర్యాదు చేశానని తెలిపారు.

రేవంత్ ట్యాక్స్‌లకు ఎగ్గొట్టేందుకు ప్రయత్నించారని…జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో జరిగిన అక్రమాలు కూడా తానే బయటికి తీశానని చెప్పారు. త్వరలో ఉప్పల్ భూ దందాను కూడా బయటపెడతానని చెప్పారు. నోటీసులకు సమాధానం చెప్పకుండా రాజకీయ కుట్ర అనడం సరికాదన్నారు.

మరోవైపు రేవంత్‌ను దాదాపు 15 గంటల పాటు ప్రశ్నించారు అధికారులు. వేల కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించాడని ప్రాధమికంగా అందుతున్న సమాచారం.

- Advertisement -