ఓటీటీలో రామారావు !

30
rt
- Advertisement -

శరత్ మండవ దర్శకత్వంలో మాస్ రాజా రవితేజ హీరోగా తెరకెక్కిన ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ ‘రామారావు ఆన్ డ్యూటీ’. బాక్సాఫీస్‌ వద్ద మిక్స్‌డ్ టాక్‌ని సొంతం చేసుకోగా తాజాగా సినిమా ఓటీటీ డేట్ ఖరారైంది.

ఈ సినిమాను థియేటర్లలో మిస్ అయిన వారు ఓటీటీలో చూసేందుకు సిద్ధం కండి అంటూ చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం సోనీ లివ్‌లో సెప్టెంబర్ 15 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు తెలిపారు.

ఈ సినిమాలో తొట్టెంపూడి వేణు చాలా కాలం తరువాత కమ్‌బ్యాక్ ఇవ్వగా దివ్యాంశ కౌశిక్, రజీషా విజయన్‌లు హీరోయిన్లుగా నటించారు. సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మించారు.

- Advertisement -