రివ్యూ: రామారావు ఆన్ డ్యూటీ

179
raviteja
- Advertisement -

మాస్ మహారాజా రవితేజ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘రామారావు ఆన్ డ్యూటీ’. శరత్ మండవ దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, రవితేజ టీం వర్క్స్ బ్యానర్ల పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొనగా ఇవాళ ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ చిత్రంతో రవితేజ ఏ మేరకు ఆకట్టుకున్నాడో చూద్దాం…

కథ:

1995 చిత్తూరులో జరిగే ఈ కథలో నిజాయితీ గల సబ్ కలెక్టర్ రామారావు(రవితేజ) . నీతి నిజాయితో ఎక్కడా ఎక్కువ కాలం డ్యూటీ చేయలేకపోతాడు. అంతేకాదు డిప్యూటీ కలెక్టర్ నుంచి ఎమ్మార్వోగా డిమోటం అయ్యి..తన సొంతూరు తిమ్మ సముద్రంకు ట్రాన్సఫర్ అవుతాడు. అక్కడ అతనికి తన చిననాటి లవర్ మాలిని (రజిష విజయన్) కలుస్తుంది. ఆమె భర్త సురేంద్ర (చైతన్య కృష్ణ) ఏడాది పాటుగా కనిపించకుండా పోయాడని తెలుస్తుంది. ఆ కేసును ఛేదించేందుకు రామారావు రంగంలోకి దిగుతాడు…తర్వాత ఏం జరుగుతుంది..? చివరకు కథ ఎలా సుఖాంతం అవుతుందనేదే స్టోరీ.

ప్లస్ పాయింట్స్‌:

సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్స్ రవితేజ నటన, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ. రామారావు పాత్రలో రవితేజ ఒదిగిపోయారు. ఓ నిజాయితీ గల ప్రభుత్వ అధికారి తలుచుకుంటే ఏమైనా చేయగలడని చూపిస్తాడు. యాక్షన్, రొమాన్స్ ఇలా అన్ని యాంగిల్స్‌లో రవితేజ నటన బాగుంది. రజిష, దివ్యాన్ష తమ పాత్రలకు వందశాతం న్యాయం చేశారు. మిగితా నటీనటుల్లో వేణు, నరేష్, పవిత్ర,నాజర్‌ల నటనకు వంకపెట్టలేం.

మైనస్ పాయింట్స్‌:

సినిమాలో మేజర్ మైనస్ పాయింట్స్ ల్యాగ్ సీన్స్, పేలని డైలాగులు, కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవడం, పాటలు.

సాంకేతిక విభాగం:

సాంకేతికంగా సినిమా పర్వాలేదు. శామ్ సీఎస్ సంగీతం, నేపథ్యం సంగీతం,. సంతోష్ కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

తీర్పు:

90వ దశకాన్ని బేస్ చేసుకుని దర్శకుడు సిద్ధం చేసుకున్న కథ రామారావు ఆన్ డ్యూటీ. రవితేజ నటన, సినిమాటోగ్రఫీ సినిమాకు ప్లస్ పాయింట్ కాగా కథపై మరింత దృష్టి సారిస్తే బాగుండేది. ఓవరాల్‌గా ఈ వీకెండ్‌లో చూడదగ్గచిత్రం రామారావు ఆన్ డ్యూటీ.

విడుదల తేదీ: 29/07/2022
రేటింగ్: 2.5/5
నటీనటులు: రవితేజ, దివ్యాన్షి కౌశిక్, రజిషా విజయన్
సంగీతం: శ్యాం సి.ఎస్
నిర్మాత: సుధాకర్ చెరుకూరి
దర్శకత్వం: శరత్ మండవ

- Advertisement -