రామప్పకు యునెస్కో గుర్తింపు..

236
ramappa
- Advertisement -

కాకతీయుల అద్భుత శిల్పకళ దేవాలయం వరంగల్‌లోని రామప్పకు యునెస్కో గుర్తింపు లభించింది. ఈ మేరకు యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో రామప్ప దేవాలయం చేరినట్లు ప్రకటించింది యునెస్కో. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. భారత్ కు రష్యా సహా 17 దేశాలు మద్దతు తెలిపాయి.

భారత కాలమానం ప్రకారం గం. 4.36కు జాబితాలో చేరింది. 2019లో ఆలయాన్ని ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆన్ మాన్యుమెంట్స్ అండ్ సైట్స్ బృందం సందర్శించింది. వరల్డ్ హెరిటేజ్ సైట్‌గా గుర్తించేందుకు 9 లోపాలున్నట్టు పేర్కొంది బృందం.

దౌత్య పద్ధతుల్లో 24 దేశాలకు రామప్ప ఆలయ విశిష్టతలను వివరించింది కేంద్ర ప్రభుత్వం. వరల్డ్ హెరిటేజ్ కమిటీ సమావేశంలో రూల్ 22.7ను ప్రయోగించి రామప్పను నామినేషన్లలో పరిగణలోకి తీసుకునేలా చేసింది రష్యా. రష్యాకు ఇథియోపియా, ఒమన్, బ్రెజిల్, ఈజిప్ట్, స్పెయిన్, థాయిలాండ్, హంగేరి, సౌదీ అరేబియా, సౌతాఫ్రికా తదితర దేశాలు మద్ధతు పలికాయి.

- Advertisement -