కోవిందుడు అందరివాడు:కేసీఆర్

242
Ramanth Kovind thanks Telangana CM, KCR
Ramanth Kovind thanks Telangana CM, KCR
- Advertisement -

రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో రామ్‌నాథ్‌కు భారీ విజ‌యం ద‌క్కుతుంద‌ని సీఎం కేసీఆర్ ఆశాభావం వ్య‌క్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం భ‌విష్య‌త్తులో త‌న ప్ర‌గ‌తి కోసం మీ ఆశీస్సులు కోరుకుంటుంద‌ని కేసీఆర్ అన్నారు.  ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్ నెక్లెస్ రోడ్ లోని జలవిహార్ లో సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ నేతలతో సమావేశమయ్యారు. కేంద్రమంత్రులు బండారు దత్తాత్రేయ, వెంకయ్యనాయుడుతోపాటు టీఆర్ ఎస్ పార్టీకి చెందిన ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. అంతకుముందు సీఎం కేసీఆర్ ఆహ్వానితులను రామ్ నాథ్ కోవింద్ కు పరిచయం చేశారు.

ramnath-cm

ఈ సంధర్బంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్ర‌ప‌తి కార్యాల‌యంలో మీరు పూర్తి స‌ఫ‌ల‌త సాధించాల‌ని ఆశిస్తున్న‌ట్లు కూడా కేసీఆర్ తెలిపారు. దేశాన్ని ఆర్థిక వృద్ధి దిశ‌గా తీసుకెళ్లుతున్న ప్ర‌ధాని మోదీకి త‌మ‌ పూర్తి మ‌ద్ద‌తు ఉంటుద‌ని సీఎం అన్నారు.  సుదీర్ఘ పోరాట తరువాత 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని.. రాష్ట్రం ఏర్పడే నాటికి చాలా సమస్యలున్నాయన్నారు.  “తక్కువ సమయంలోనే అభివృద్ది చెందుతున్న రాష్ట్రం తెలంగాణ. తెలంగాణ ప్రస్తుతం సంక్షేమ రాష్ట్రంగా అవతరించింది. రాష్ట్రంలో దాదాపు 30 లక్షల మందికి ఫించన్లు ఇస్తున్నాం.. వృద్దులు, వికలాంగులకు నెలనెల ఫించన్లు ఇచ్చి ఆదుకుంటున్నాం. జీఎస్‌డీపీ వృద్ది రేటులో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నాం. అతి తక్కువ రోజుల్లోనే విద్యుత్ మిగులు రాష్ట్రంగా గుర్తింపు పొందాం” అని అన్నారు. టీఎస్ ఐపాస్ ద్వారా ప‌రిశ్ర‌మ‌ల‌కు 15 రోజుల్లోనే అనుమ‌తులిస్తున్నామ‌న్నారు. రెండేళ్లుగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో రాష్ట్రానికి మొద‌టి ర్యాంక్ వ‌స్తోంద‌ని సీఎం కేసీఆర్ అన్నారు. అతిథి రామ్‌నాథ్‌ను సీఎం కేసీఆర్ శాలువ క‌ప్పి, పుష్ఫ‌గుచ్ఛం ఇచ్చి స‌న్మానించారు.

Kovind

రామ్ నాధ్ కోవింద్‌ మాట్లాడుతూ.. బీజేపీ అధిష్ఠానం త‌న‌ను రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించిన వెంట‌నే టీఆర్ఎస్ మ‌ద్దతు తెలిపింద‌ని అన్నారు. తాను నామినేష‌న్ వేసే స‌మ‌యంలోనూ టీఆర్ఎస్ మ‌ద్ద‌తుగా నిలిచిందని చెప్పారు.  తాను బీహార్‌ గ‌వ‌ర్న‌ర్‌గా ప‌నిచేసిన‌ప్పుడు కూడా ఏ పార్టీవైపునా ప‌క్ష‌పాతం చూపించ‌లేద‌ని అన్నారు. ప్ర‌పంచంలోనే అతిపెద్ద ప్ర‌జాస్వామ్య దేశం భార‌త్ అని రామ్ నాథ్ కోవింద్ అన్నారు. అటువంటి భార‌త్‌లో రాజ్యాంగబ‌ద్ధంగా న‌డుచుకోవాల‌ని అన్నారు. రాజ్యాంగ‌బ‌ద్ధ ప‌ద‌వులు స్వీక‌రించిన‌ప్పుడు వాటికి త‌గిన విధంగా న‌డుచుకోవాలని, త‌న‌కు అప్ప‌గిస్తోన్న బాధ్య‌త‌ల‌ను స‌మ‌ర్థంగా నిర్వ‌ర్తించ‌డ‌మే త‌న ల‌క్ష్య‌మ‌ని చెప్పారు.

- Advertisement -