దగబడ్డ తెలంగాణకు నేనున్నాను అంటూ కేసీఆర్ సభ పెట్టారు అన్నారు ఎమ్మెల్సీ రమణ. ఆ సభకు వ్యతిరేకంగా.. పోటీగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభ నిర్వహించారు..ఇలాంటి ఘటన చరిత్రలో లేదు.. రేవంత్ రెడ్డి వ్యవహారంతో రాజకీయ నాయకులు తల దించుకునే పరిస్థితి వచ్చింది..కాంగ్రెస్ దిక్కు లేని స్థితిలో రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసింది.. రేవంత్ రెడ్డికి పాలన చేతగాక చేతులెత్తేసారు..రాబోయే కాలంలో ప్రజా కోర్టులో రేవంత్ రెడ్డికి శిక్ష తప్పదు..అన్ని వర్గాలు ప్రభుత్వం పట్ల వ్యతిరేకంగా ఉన్నాయి.. కాంగ్రెస్ కాలగర్భంలో కలవనుంది..ఇప్పటికైనా మీకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి అన్నారు.
కేసీఆర్ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోటీగా సభ నిర్వహించారు..ఇది ముఖ్యమంత్రి సంకుచిత బుద్ధి..పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు రేవంత్ రెడ్డి వ్యవహరించారు..కెసిఆర్ స్థాయి.. రేవంత్ రెడ్డి స్థాయి ఏంటో ప్రజలకు అర్థమైంది..కెసిఆర్ ప్రసంగాలు 36 లక్షల మంది వీక్షించారు..రేవంత్ రెడ్డి ప్రసంగాన్ని నాలుగు లక్షల మంది వీక్షించాలి..కేవలం 10 శాతం కూడా రేవంత్ రెడ్డి ప్రసంగాన్ని చూడలేదు..బిఆర్ఎస్ అఫీషియల్ వెబ్సైట్లో కెసిఆర్ ప్రసంగాన్ని 2000 మంది లైవ్ లో చూశారు..కాంగ్రెస్ అఫీషియల్ వెబ్సైట్లో 54 మంది మాత్రమే రేవంత్ ప్రసంగం లైవ్ లో చూశారు..కెసిఆర్ ఎంతో హుందాగా మాట్లాడారు.. స్టేట్ ఇంట్రెస్ట్ గా మాట్లాడారు..రేవంత్ రెడ్డి స్ట్రీట్ మ్యాన్ లా మాట్లాడారు..ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు కూడా తీయకుండా కేసీఆర్ మాట్లాడారు అన్నారు.
Also Read:‘వాలా Ⅱ’ కోసం నాని!
కానీ రేవంత్ రెడ్డి తిట్ల పురాణం చేశారు..చిల్లర మాటలు ఆపేసి.. ఫ్రస్టేషన్ లేకుండా వ్యవహరించాలి..నా ఢిల్లీ పర్యటనపై కూడా కథనాలు అల్లారు.. అందులో ఏదో రహస్యం ఉన్నట్లు వివరించారు..కాలేశ్వరం కేస్ మీదనే ఢిల్లీ పర్యటన చేశాను..కాలేశ్వరం కేసుపై సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు సీనియర్ అడ్వకేట్ ని సంప్రదించాం..ఎమ్మెల్యేల ఫిరాయింపులపై ఇదివరకే సుప్రీంకోర్టు మొట్టికాయ వేసింది..ఓట్ ఫర్ నోటు కేసు సుప్రీంకోర్టులో రేపు మధ్యాహ్నం 3 గంటలకు హియరింగ్ వస్తుంది..ఈ కేసులో బిఆర్ఎస్ కూడా ఇంప్లీడ్ అయి ఉంది..ఈ కేసులో ప్రభుత్వం తరఫున నామ మాత్రంగా ఓ అడ్వకేట్ ను నియమించారు..ముద్దాయి రేవంత్ రెడ్డి తరఫున ప్రముఖ న్యాయవాదులను నియమించుకున్నారు..ఈ కేసులో రేవంత్ రెడ్డికి శిక్ష పడేందుకు బిఆర్ఎస్ తరఫున న్యాయపోరాటం చేస్తున్నం..ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాలుగేళ్ల నుంచి స్టే మీద తిరుగుతున్నారు..స్టే తొలగితే ముఖ్యమంత్రి కుర్చీకే ప్రమాదం వస్తుంది..రేవంత్ రెడ్డి బిజెపి, ఎన్డీఏ నాయకులతో అంటకాగి తిరుగుతున్నారు..కెసిఆర్ జగిత్యాల సభ పెట్టినప్పుడే రైతు భరోసా గుర్తొచ్చింది..వడ్లు కల్లాలకు వచ్చినా ఇప్పటికీ పెట్టుబడి సాయం రాలేదు..బిఆర్ఎస్ సభలు పెడితే తప్ప రైతు భరోసా పడటం లేదు..కెసిఆర్ సభను డైవర్ట్ చేసేందుకు డ్రామాలాడుతున్నారు..ఈ కాలానికి ఇవ్వాల్సిన రైతుబంధును ఆరు నెలలు గడిచిన ఇప్పటికి పడలేదు..కాలేశ్వరంపై నిన్న రేవంత్ రెడ్డి ఒక మాట నిజం మాట్లాడారు..రెండు పిల్లర్లు మాత్రమే కుంగాయని చెప్పారు..కాలేశ్వరంపై రేవంత్ రెడ్డికి ఏబిసిడిలు కూడా తెలియదు..కాలేశ్వరం మూడు లెవెల్స్ లో పనిచేస్తుంది..మంచి వర్షపాతం వస్తే మిడ్ మానేరు నుంచి నీళ్లు వదలాలి..మోస్తారు వర్షపాతం ఉంటే ఎల్లంపల్లి నుంచి నీళ్లు వదలాలి..కరువు సంభవిస్తే మేడిగడ్డ నుంచి నీళ్లు వదలాలి..ఈసారి ఎల్ నినో కరువు సంభవిస్తుందని హడావుడిగా మేడిగడ్డకు పరిగెత్తారు..కరువు వస్తుందంటే మేడిగడ్డ గుర్తొచ్చింది.. ఇప్పటికైనా మేడిగడ్డ గొప్పతనం తెలిసి వచ్చింది అన్నారు.

