అంతా అనుకున్నట్లు జరిగింది. టీటీడీలోకి రీ ఎంట్రీ ఇచ్చారు రమణదీక్షితులు. టీటీడీ ఆగమ సలహాదారుగా రమణదీక్షితులును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. టీటీడీలో సుదీర్ఘకాలం ప్రధాన అర్చకుడిగా సేవలు అందించారు దీక్షితులు.అయితే అనువంశిక అర్చకులకు పదవీ విరమణ నిబంధనను టీడీపీ సర్కార్ తీసుకురావడంతో ఆయన టీటీడీకి దూరమయ్యారు.
టీడీపీ నిర్ణయంపై ఆయన కోర్టులో పిటిషన్లు వేసినా ఊరట లభించలేదు. ఈ నేపథ్యంలో ప్రతిపక్షనేతగా జగన్ ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. టీటీడీలోకి తిరిగి రమణ దీక్షితులకు అవకాశం కల్పించింది ఏపీ సర్కార్. కొత్తగా నియమితులయ్యే అర్చకులకు సలహాలు, సూచనలు ఇచ్చేందుకు, మార్గనిర్దేశం చేసేలా ఆయన సేవలను టీటీడీ వినియోగించుకోవాలని భావిస్తోంది.
టీడీపీ హయాంలో అనువంశిక అర్చకులకు పదవీ విరమణ నిబంధనను తీసుకురాగా తిరిగి రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో అర్చకులకు వంశపారంపర్య హక్కులను కల్పిస్తు ఉత్తర్వులు జారీ చేసింది దేవాదాయ శాఖ.