అయోధ్య కేసులో సుప్రీం కోర్టు తీర్పు స్వాగతించాలి

388
Ramagundam cp Satyanarayana
- Advertisement -

ఉత్తర ప్రదేశ్ లోని అయోధ్య రామమందిరం కేసులో సుప్రీం కోర్టు తీర్పు ఏవిధంగా ఇచ్చినా స్వాగతించాలన్నారు రామగుండం సీపీ సత్యనారాయణ. పెద్దపల్లి పట్టణంలో ని ఎం బి గార్డెన్స్ లో పలువురు హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ల మత పెద్దలతో శాంతి కమిటీ సమావేశంలో సీపీ సత్యనారాయణ పాల్గోన్నారు. ఈ కార్యక్రమంలో డీసీపీ రవీందర్, ఏసీపీ హాబీబ్ ఖాన్, పలువురు అధికారులు హాజరయ్యారు.

సీపీ సత్యనారాయణ సత్యనారాయణ మాట్లాడుతూ.. అయోధ్య కేసులో సుప్రిం కోర్టు ఎటువంటి తీర్పు ఇచ్చినా మత పెద్దలు స్వాగతించాలి. జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా మత పెద్దలు పోలీసు శాఖ కు సహకరించాలి. సోషల్ మీడియాలో మత కలహాలను సృష్టించే విధమైన అసత్యపు వార్తలను నమ్మవద్దు. చట్టవ్యతిరేకమైన, ప్రజల శాంతికి భంగం కలిగించే ఎంతటివారైనా ఉపేక్షించబోమని హెచ్చరించారు. ప్రజలు శాంతియుతంగా జీవనం గడిపేలా చూడడమే రామగుండం కమిషనరేట్ లక్ష్యం అని తెలిపారు.

- Advertisement -