- Advertisement -
న్యాయవాదుల దంపతుల హత్యకేసులో ప్రస్తుతం హైదరాబాద్‌కు చెందిన ప్రత్యేక పోలీసు బృందం దర్యాప్తు చేస్తోందని తెలిపారు రామగుండం సీపీ సత్యనారాయణ. మీడియాతో మాట్లాడిన ఆయన..హత్యకేసులో ఎంతటివారున్నా వదలబోమని స్పష్టం చేశారు.
ఈ కేసును హైకోర్టు చీఫ్ జస్టిస్ పర్యవేక్షిస్తున్నారని…. వామన్ రావు హత్యకేసులో బిట్టు శ్రీను పాత్ర ఉందని తేల్చింది తామేనని చెప్పారు. హత్యకు ముందు నిందితులకు బిట్టు శ్రీను కాల్ చేశారని… అతని వెనుక ఎవరున్నా విచారిస్తామని…ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామన్నారు.
rj న్యాయవాదులు వామనరావు, నాగమణి హత్యకేసులో ముగ్గురు నిందితులకు కోర్టు 14 రోజుల జుడీషియల్ కస్టడీ విధించింది. హత్యకేసులో ఏ-1 కుంట శ్రీనివాస్, ఏ-2 శివందుల చిరంజీవి, ఏ-3 అక్కపాక కుమార్‌లను కరీంనగర్ జిల్లా జైలుకు తరలించారు.
- Advertisement -