మహిళల భద్రత పోలీసు బాధ్యత- సిపి

455
Ramagundam Commissioner Satyanarayana
- Advertisement -

మంచిర్యాల జిల్లా మందమర్రిలోని సాయి మిత్ర ఫంక్షన్ హాలులో “మహిళల భద్రత పోలీసు బాధ్యత” అనే కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ,ఎసిపి రహమాన్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారభించారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో మహిళలు, విద్యార్థులు పాల్గొన్నారు.

Ramagundam CP

ఈ సందర్భంగా సిపి సత్యనారాయణ మాట్లాడుతూ.. మహిళల భద్రత పట్ల పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉన్నామని.. విద్యార్థులు, మహిళలల పట్ల అనుచితంగా ప్రవర్తించే వారి పట్ల ఉక్కు పాదం మోపుతామన్నారు. పిల్లల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి అని సిపి సత్యనారాయణ తెలిపారు.

- Advertisement -