రంజాన్..ముస్లింల ప్రత్యేక ప్రార్థనలు

4
- Advertisement -

పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమవడంతో ముస్లిం సోదరులు ఆనందోత్సాహాలతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. జంట నగరాలైన హైదరాబాద్-సికింద్రాబాద్ ప్రాంతాల్లో ముఖ్యంగా చార్మినార్ పరిసరాల్లో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. “చాంద్ ముబారక్” అంటూ ఒకరినొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ముస్లింలు సంబరాలు జరుపుకున్నారు.

బుధవారం సాయంత్రం సుమారు 7.30 గంటలకు ఆకాశంలో చంద్రవంక దర్శనమిచ్చినట్లు ప్రకటించారు. అనంతరం మక్కా మజీద్ నుంచి రంజాన్ మాసం ప్రారంభాన్ని సూచిస్తూ సైరన్ మోగించారు. ఈ ప్రకటనతో నగరంలోని మసీదుల్లో ప్రత్యేక నమాజ్‌లకు ఏర్పాట్లు పూర్తి చేశారు. రాత్రి తర్వీహ్ ప్రార్థనలతో భక్తులు మసీదులకు తరలివచ్చారు.

నేడు (గురువారం) వేకువజామున నుంచే రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం సేహరీ భోజనం అనంతరం ఉపవాసం ఆచరిస్తూ సాయంత్రం ఇఫ్తార్‌తో ముగిస్తారు. నెలరోజుల పాటు ఉపవాసం, ప్రార్థనలు, దానధర్మాలు నిర్వహించడం రంజాన్ ప్రత్యేకత. భక్తి, నియమ నిష్ఠలతో ఈ పవిత్ర మాసాన్ని ఆచరించాలని మత పెద్దలు సూచించారు. నగరవ్యాప్తంగా శాంతి, సౌభ్రాతృత్వ వాతావరణం నెలకొంది.

Also Read:కనిపించిన రంజాన్ నెలవంక

- Advertisement -