నమస్తే తెలంగాణ సీఎండీని రామర్శించిన సీఎం కేసీఆర్‌..

59

ఇటీవల నమస్తే తెలంగాణ సీఎండీ దామోదర్ రావు తండ్రి నారాయాణ రావు కన్నుమూశారు. ఈ మేరకు దామోదర్ రావును సీఎం కేసీఆర్ పరామర్శించారు. బంజారాహిల్స్‌లోని దామోదర్ రావు నివాసానికి వెళ్లిన సీఎం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. సీఎం కేసీఆర్ వెంట ఎంపీ సంతోష్ కుమార్,ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్,ఎమ్మెల్సీలు శేరి సుభాష్ రెడ్డి,నవీన్ రావు టీఆరెస్ నాయకులు శ్రవణ్ రెడ్డి పాల్గొన్నారు.