రామారావు..మ‌ళ్లీ వాయిదా!

35
raviteja
- Advertisement -

మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, రవితేజ టీం వర్క్స్ బ్యానర్ల పై సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ చిత్రం రామారావు ఆన్ డ్యూటీ.

తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఆస‌క్తిక‌ర వార్త టాలీవుడ్‌లో వైర‌ల్‌గా మారింది. సినిమా విడుద‌ల తేదీ మ‌ళ్లీ వాయిదా ప‌డ్డ‌ట్లు తెలుస్తోంది. గ‌తంలో మార్చి 25న కాని, ఏప్రిల్ 14న గాని రిలీజ్ చేస్తామని ప్రకటించారు. మార్చి 25న ట్రిపుల్ ఆర్, ఏప్రిల్ 14న కేజిఎఫ్ 2 భారీ సినిమాలు రిలీజ్ డేట్స్ ఫిక్స్ కావడంతో రామారావు ఆన్ డ్యూటీ సినిమాకు జూన్ 17 డేట్ కి రిలీజ్ ఫిక్స్ చేసుకున్నారు. ఇప్పుడు జూన్ 17నుంచి తప్పుకుని జులై అంటున్నారు. అయితే జూలైలో కూడా విడుద‌ల అయ్యేలా క‌నిపించ‌డం లేదు. ఎందుకంటే సినిమా వాయిదాకి కారణం ప్రొడ్యూసర్, హీరోకి మధ్య వచ్చిన అభిప్రాయ బేధాలే అని తెలుస్తోంది.

యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ లో రజిషా విజయన్, దివ్యాంశ కౌశిక్‌ కథానాయికలుగా నటిస్తుండగా, సీనియర్ హీరో వేణు తొట్టెంపూడి ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫర్ గా సత్యన్ సూర్యన్ ఐ.ఎస్.సి, ఎడిటర్ గా ప్రవీణ్ కేఎల్ పని చేస్తున్నారు.

- Advertisement -