- Advertisement -
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హరితసేన లో భాగంలో, మధులిక ఇచ్చిన ఛాలెంజ్ స్వీకారించి జూబ్లీహిల్స్ లో మొక్కలు నాటారు నటుడు రామ్ సాత్విక్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..జోగినపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఛాలెంజ్ హరితసేన లో భాగంలో మొక్కలు నాటడం చాలా ఆనందంగా ఉంది అన్నారు.
ప్రతీ ఒక్కరు మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. అందరిని చిన్న, పెద్ద, పార్టీలకు అతీతంగా మొక్కలు నాటే కార్యక్రమం లో ప్రతీ ఒక్కరిని భాగస్వామ్యం చేస్తూ మొక్కలు నాటించడం చాలా గొప్ప విషయం అన్నారు. ఏడు సంవత్సరాల నుండి నిరంతరం మొక్కలు నాటే కార్యక్రమం ఒక యజ్ఞం లా తీసుకొని గ్రీనరి పెంచే దిశగా పని చేస్తున్న మాజీ రాజ్య సభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్టేట్ కోఆర్డినేటర్ భోజ నారాయణ పాల్గొవడం జరిగింది అన్నారు.
Also Read:భౌగోళిక వారసత్వ జాబితాలో బెలుం గుహలు
- Advertisement -

