దుమ్మురేపుతున్న ‘సీటీమార్’ ట్రైలర్‌..

220
Seetimaarr trailer
- Advertisement -

టాలీవుడ్‌ మ్యాచో హీరో గోపీచంద్ కథానాయకుడిగా సంపత్ నంది దర్శకత్వంలో ‘సీటీమార్’ రూపొందింది. తమన్నా కథానాయికగా నటించిన ఈ సినిమా, కబడ్డీ నేపథ్యంలో కొనసాగుతుంది. చిట్టూరి శ్రీనివాస్ నిర్మించిన ఈ సినిమా వినాయకచవితి కానుకగా సెప్టెంబరు 10న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ నుంచి తాజా ట్రైలర్‌ విడుదలైంది. హీరో రామ్ చేతుల మీదుగా రిలీజ్ చేయించిన ఈ ట్రైలర్ దుమ్ములేపుతోంది.

‘ఒక ఊరి నుంచి ఎనిమిది మంది ప్లేయర్సా? మీకు రూల్స్‌ తెలుసు కదా’ అనే సంభాషణతో ప్రారంభమవుతుందీ ట్రైలర్‌. ‘రూల్స్‌ ప్రకారం పంపిస్తే ఆడి వస్తారు సర్‌. రూట్ లెవల్‌ నుంచి ఆలోచించి పంపిస్తే పేపర్‌లో వస్తారు’ అని గోపీచంద్‌ ఇచ్చిన సమాధానం అలరిస్తుంది. పవర్‌ ఫుల్‌ డైలాగ్స్‌తో, యాక్షన్‌ సన్నివేశాలతో ఆద్యంతం ఆసక్తిగా సాగింది. ‘ఒక్కసారి కోర్టులో అడుగుపెట్టాక మీ ఫోకస్‌ ఉండాల్సింది కూత, గీత మీదే.. ఈ బ్యాచ్‌ అయిపోయేలోపు మ్యాచ్‌ అయిపోవాలి ’ అంటూ కోచ్‌గా గోపీచంద్‌ విశేషంగా ఆకట్టుకుంటున్నారు. గోపీచంద్‌, తమన్నా, రావు రమేశ్‌ నటన మెప్పిస్తోంది. నేపథ్య సంగీతం ప్రధాన బలంగా నిలిచింది. కాగా ఈ సినిమాలో గోపీచంద్‌, తమన్నా ఆంధ్రా, తెలంగాణ కబడ్డీ జట్ల కోచ్‌లుగా కనిపించనున్నారు. దిగంగనా సూర్యవంశీ, భూమిక కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

- Advertisement -