గ్రీనరీ పెంచడంలో తెలంగాణ దేశానికే ఆదర్శం- ఎమ్మెల్యే

138
MLA Harshvardhan Reddy
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా కొల్లాపూర్ శాసనసభ్యులు బీరం హర్షవర్ధన్ రెడ్డి తన పుట్టినరోజు పురస్కరించుకుని హైదరాబాద్ బంజారా హిల్స్ ఎమ్మెల్యే కాలనీలో తన నివాసంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ హరితహారం స్పూర్తితో రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటడం సంతోషంగా ఉందని అన్నారు.

ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసిన ఎంపీ సంతోష్ కుమార్‌కి భీరం హర్షవర్ధన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.తెలంగాణ రాష్ట్రంలో ఏ మంచి కార్యక్రమం ప్రారంభించాలన్న,పుట్టినరోజు,పెళ్లి రోజు ఇతర శుభకార్యాలకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో మొక్కలు నాటడం సంప్రదాయంగా మారిందని.. హరిత హారం,గ్రీన్ ఇండియ ఛాలెంజ్ కార్యక్రమాల ద్వారా రాష్ట్రంలో అటవీ శాతం పెరిగిందని అన్నారు. గ్రినరీ పెంచడంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ దేశవ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతుందని.. దీన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాలి అని భీరం హర్షవర్ధన్ రెడ్డి తెలిపారు.

- Advertisement -