రామ్ ‘రెడ్’ టీజర్ కు ముహుర్తం ఖరారు

368
red-action
- Advertisement -

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోత్తినేని ప్రస్తుతం రెడ్ మూవీలో నటిస్తున్నారు. థ్రిల్ల‌ర్ నేపధ్యంలో తెరకెక్కుతున్న ఈచిత్రానికి కిశోర్ తిరుమల దర్శకత్వం వహించగా స్రవంతి రవికిషోర్ నిర్మిస్తున్నారు. నివేదా పేతురాజ్, మాళవికా శర్మ , అమృత అయ్యర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రెడ్ మూవీ రామ్ లుక్ కు అద్భుతమైన స్పందన వచ్చింది.

తాజాగా ఈమూవీ టీజర్ విడుదల తేదీని ఖరారు చేశారు. ఫిబ్రవరి 28 సాయంత్రం 5 గంటలకు విడుద‌ల కానుంద‌ని తెలియ‌జేస్తూ పోస్ట‌ర్ విడుద‌ల చేశారు. ఈ చిత్రంలోని ఓ పాట‌ని సముద్ర తీరానికి 10 వేల అడుగుల ఎత్తులోని డోలమైట్స్‌లో మైనస్‌ ఐదు డిగ్రీల వాతావరణంలో చిత్రీకరించారు. ఎప్రిల్ 9న ఈచిత్రం గ్రాండ్ గా విడుదలకానుంది.

- Advertisement -