దర్శకుడు బోయపాటి శ్రీను “అఖండ”తో మాస్ యాక్షన్ డ్రామా జానర్‌లో మాస్టర్ అని నిరూపించుకున్నాడు. ఈసారి బోయపాటి మరో కమర్షియల్ సినిమాను అందించే ప్లానింగ్ లో ఉన్నాడు. ఈ సినిమాలో ఉస్తాద్ రామ్ పోతినేని హీరో. నందమూరి బాలకృష్ణ కాకుండా వేరే హీరోతో బోయపాటి పనిచేసినప్పుడల్లా ఫలితాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి.
అయితే ఈ క్రమంలో రామ్ పోతినేని వంటి యువ హీరోతో ఎలాంటి బ్లాక్‌బస్టర్ కొడతాడా ? అని అందరూ మాట్లాడుకుంటున్నారు. ఈసారి యంగ్ హీరోతో కూడా ఓ బ్లాక్ బస్టర్ తీయగలడని నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాడు.
ఈ సినిమాలో రామ్ పోతినేని కోసం కొన్ని యాక్షన్ సన్నివేశాలను వ్రాసుకున్నాడు. ఇందులో ఓపెనింగ్ సీక్వెన్స్ ప్రేక్షకులను షాక్‌కి గురి చేస్తుందని యూనిట్ వర్గాలు చెప్తున్నాయి. ప్రస్తుతం సినిమా షూటింగ్ జరుగుతోంది. రామ్ సరసన శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..