- Advertisement -
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆరోగ్య పరిస్థితిపై ఢిల్లీ ఆర్మీ ఆస్పత్రి బులెటిన్ విడుదల చేసింది. ప్రస్తుతం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆరోగ్యం నిలకడగా ఉందని…మరిన్ని పరీక్షల కోసం ఎయిమ్స్ ఆస్పత్రికి వెళ్లాలని సిఫార్సు చేస్తున్నట్లు వెల్లడించింది ఆర్మీ ఆస్పత్రి.
రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ స్వల్ప అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. ఛాతీలో అసౌకర్యంగా ఉండడంతో ఆయన ఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రిలో చేరారు. రాష్ట్రపతికి వైద్య పరీక్షలు చేసిన ఆర్మీ ఆసుపత్రి డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, పరిశీలనలో ఉంచామని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.
- Advertisement -