తానా వేదికగా బీజేపీ నేత రాంమాధవ్‌కు చేదు అనుభవం ఎదురైంది. వాషింగ్టన్ డీసీలో జరుగుతున్న తానా వేడుకల్లో పాల్గొన్న రాంమాధవ్ ప్రసంగిస్తున్న సమయంలో ఆయన ప్రసంగానికి అడ్డు తగిలారు ప్రవాసాంధ్రులు.
దేశంలో మోడీ హయాం లో జరుగుతున్న అభివృద్ధి గురించి రాంమాధవ్ చెబుతుండగా.. వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన ప్రవాసాంధ్రులు అడ్డుతగిలారు. ఈలలు, కేకలు వేస్తూ రాంమాధవ్ వేదిక మీద నుంచి దిగిపోవాలంటూ నినాదాలు చేశారు. దీంతో ఆయన తన ప్రసంగాన్ని అర్ధంతరంగా ముగించి వెనుదిరిగారు
మూడు రోజుల పాటు అంగరంగ వైభోగంగా సాగిన తానా 22వ మహాసభలు సంగీత విభావరితో ముగిశాయి. ఇక ప్రస్తుత తానా అధ్యక్షుడు వేమన సతీశ్ పదవీ కాలం ముగిసింది. దీంతో తాజా అధ్యక్షుడిగా ఖమ్మంకు చెందిన తాళ్లూరి జయశేఖర్‌కు బాధ్యత అప్పగించారు. ఈ వేడుకల్లో న్‌టీవీ చౌదరికి జీవిత సాఫల్యం, భారత్ బయోటెక్ ఎల్లా కృష్ణకు తానా పురస్కారం అందించారు.