ఆడవారి మాటలకు అర్థాలే వేరు అంటుంటారు. కానీ..వర్మ మాటలకి కూడా అర్థాలే వేరు అని చెప్పకుండా ఉండడం కష్టం. ఎందుకంటే..వర్మ మాట్లాడే మాటలు అంత మామూలుగా అర్థం కావు. అవును..వర్మ మాటలు అర్థంకావాలంటే..బుర్ర బద్దలవాల్సిందే..! సంచలన దర్శకుడిగా..కాంట్రవర్షి లకి కేరాఫ్ అడ్రస్‌గా రామ్‌గోపాల్‌వర్మ నిలిచాడని అందరి అభిప్రాయం.
అయితే..వర్మ చెప్పే మాటల్లో ఎంత నిజముంటుందో తెలీదు గానీ.. వాటికి అర్థాలు మాత్రం చాలానే ఉంటాయి. ‘నా మాటలు మీకు అర్థమైతే ఓకె..లేకపోతే మీ కర్మ’..అనే భావలోనే ఉంటాడు వర్మ.
ఇక ఇదిలా ఉంటే..సంచలన కామెంట్స్‌తో ఎప్పుడూ..వార్తల్లో నిలిచే వర్మ ఇప్పుడు మళ్ళీ కొత్త కాంట్రవర్శికి తెరలేపాడు. ఇటీవలే రీలీజైన కాటమరాయుడి పై వర్మ కామెంట్స్ సంచలనం సృష్టిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ నటించిన ‘కాటమరాయుడు’ను టార్గెట్ చేస్తూ రెచ్చిపోయాడు వర్మ. ఇప్పుడు డొస్ పెంచిమరీ సూటిగా ‘కాటమరాయుడు’ పేరెత్తకుండా మారుపేర్లతో ఈ సినిమా గురించి ఓ ఆట ఆడేసుకున్నాడు వర్మ.
ఎవరో 70 ఏళ్ల పెద్ద మనిషి వచ్చి వర్మకు చెప్పాడట.. ‘కాటమరాయుడు’ చూడటం కంటే పోర్న్ సినిమా చూడటం మేలని. ‘సర్దార్ గబ్బర్ సింగ్’ కంటే ‘కాటమరాయుడు’ బెటర్ సినిమానో కాదో తనకు తెలియదని.. ఐతే ‘బాహుబలి-2’ ట్రైలర్ చూసి పవన్ కొంచెం అయినా నేర్చుకోవాలని.. ఇలాంటి పవర్ లెస్ సినిమాలు తీయడం మానుకోవాలని.. ఇది తన ఇన్ సిన్సియర్ నాన్ అడ్వైజ్ అని తనదైన శైలిలో వ్యాఖ్యానించాడు వర్మ.
అయితే వర్మ ‘కాటమరాయుడు’ మీద ట్వీట్ల దాడి మొదలుపెట్టగానే పవన్ అభిమానులు వర్మ మీదికి దండెత్తారు. దీంతో వర్మ కూడా వాళ్లను టార్గెట్ చేయ్యడం మొదలు పెట్టేశాడు. ఎవరో సుబ్బారావు చెప్పాడట.. అతడి అభిమానులు ఎద్దులు కూడా కాదు, గొర్రెలు అని.. ఎద్దులకు కనీసం తోలు మందంగా అయినా ఉంటుందని.. కానీ అతడి అభిమానులకు అలా కూడా ఉండదని. ఇక ఎవరో రాకేశ్వర్ అనే ఒక క్యారెక్టర్ పేరు పెట్టి.. ముగ్గుర్ని పెళ్లి చేసుకున్నందుకు గర్వించడం మాని.. ఒక్క మంచి సినిమా అయినా ప్రొడ్యూస్ చేయాల్సిందని హితవుపలికారు వర్మ.
అయితే చివరగా.. కాటమరాయుడు.. అవతార్ కన్నా, బాహుబలి-2 ట్రైలర్ కన్నా బాగుందని తన పనిమనిషి అన్నారని.. దీన్ని 100 మిలియన్ సార్లు చూడాలని కూడా పేర్కొన్నట్లుగా వర్మ తన ట్విట్లని కన్‌క్లూజ్ చేస్తూ చెప్పాడు. అసలే ‘కాటమరాయుడు’ డివైడ్ టాక్ మీదుంది. ఇదే టైంలో ఈ సినిమాపై వర్మ చేసిన వ్యాఖ్యలు పవన్ అభిమానుల్ని కాస్త ఇబ్బంది పెట్టినట్టే ఉన్నాయని నెటిజన్ల ఫీలింగ్.