వివాదాలకు కేరాఫ్ అడ్రస్ రాంగోపాల్ వర్మ ఎక్కువగా తాను తీసిన సినిమాలతో కంటే..వివాదాస్పద వ్యాఖ్యలతోనే వార్తల్లో నిలిచాడనేది వాస్తవం. అయితే వర్మ ఏది చేసినా అది సంచలనమే. ఎప్పుడు ఎవరిమీద మాటల యుద్దం చేస్తాడో తెలీదు. తూటాల్లాంటి మాటలతో విరుచుకుపడడం, ఆ తర్వాత సారీ లు చెప్పడం వర్మకు మాత్రమే సొంతం. అందుకు ట్వీట్టర్ వేదికగా ఎంచుకున్న వర్మ.. తాను చెప్పదలుచుకున్నది సూటిగా చెప్పేస్తాడు.. అయితే తాజాగా వర్మ తన ఫాలోవర్లను షాక్‌కి గురిచేశాడు. “ఇదే నా చివరి ట్వీట్. పుట్టింది: 27-5-2009, మరణం: 27-5-2017″… అంటూ నిత్యమూ తన ట్విట్టర్ ఖాతాలో ఏదో ఒక అంశంపై తనదైన శైలిలో పోస్టులు పెడుతూ వార్తల్లో ఉండే వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ సంచలన ట్వీట్ చేశారు. ఇంతకాలం తనను ఫాలో అవుతూ వచ్చిన వారికి కృతజ్ఞతలు చెప్పాడు. ఆపై తన ట్విట్టర్ ఖాతాను తొలగించాడు.
ఇక మీదట ట్విట్టర్ వాడబోవడం లేదని, కేవలం ఇన్ స్టాగ్రామ్ ను మాత్రమే వాడతానని స్పష్టం చేశారు. ఇకపై తన అభిప్రాయాలను, భావాలను ఫోటోలు, వీడియోల రూపంలో అభిమానులతో పంచుకుంటానని అన్నాడు. అయితే రామ్ గోపాల్ వర్మ అన్నీ మాట్లాడేశాక నేను మాట మీద నిలబడను అంటుంటాడు. అందుకే ఆయన చెప్పే మాటల్ని సీరియస్ గా తీసుకోవాలో లేక లైట్ గా తీసుకోవాలో అర్థం కాక జనాలు తలకిందులవుతుంటారు.