రామ్‌గోపాల్ వర్మ..ఓ సంచలన దర్శకుడు. ఈయనకు మరో పేరు కూడా ఉంది. అదే..వివాదాలకు పెట్టింది పేరు రాంగోపాల్ వర్మ అని. వర్మ ఎక్కువగా తాను తీసిన సినిమాలతో కంటే..వివాదాస్పద వ్యాఖ్యలతోనే కాంట్రవర్శికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచాడనేది వాస్తవం.
అయితే వర్మ ఏది చేసినా అది సంచలనమే. ఎప్పుడు ఎవరిమీద మాటల యుద్దం చేస్తాడో తెలీదు. తూటాల్లాంటి మాటలతో విరుచుకుపడడం, ఆ తర్వాత సారీ లు చెప్పడం వర్మకు మాత్రమే సొంతం. ఇదిలాఉంటే.. వర్మ తన మనసులోమాటని చెప్పేశాడు. నా బతుకు నన్ను బతకనివ్వండి అంటున్నాడు.
ఎప్పుడూ సెలబ్రెటీలపై, ఇతర విషయాలపై సోషల్‌మీడియాలో తనదైన స్టైల్ లో స్పందించే వర్మ ఓ ఇంటర్వ్యూలో తన గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తాను చనిపోతే కచ్చితంగా నరకానికే వెళ్తానని.. కనీసం ఇక్కడున్నంతవరకైనా స్వర్గాన్ని ఎంజాయ్ చేయనివ్వండని అంటున్నాడు.
అంతేకాకుండా తాను ట్విటర్ రాజుని కానని, నిజానికి తానో జోకర్ అని చెప్పేశాడు. ఇతరులపైనే కాదు తనపైనా జోకులు వేసుకుంటాడని, కానీ ప్రజలు తనను తప్పుగా అర్థం చేసుకుంటారని అన్నాడు. ఏదేమైనా ఇతరుల గురించి తప్పుగా విమర్శలు చేయనని వినాయకుడిపై ఒట్టేశానని, సోషల్‌మీడియాలో యాక్టీవ్‌గానే ఉంటాను కానీ నెగిటీవ్‌గా ఎలాంటి వ్యాఖ్యలు చేయనని చెప్పాడు వర్మ. ఇక తన జీవితం గురించి చెప్పాలంటే రోజూ తనకు ఇదో జర్నీ అని, ప్రతి ఉదయం తాను కొత్తగా పుడతాడని, రాత్రికి చనిపోతాడని చెప్పుకొచ్చాడు.
అంతేకాకుండా తాను ఏం చేసినా ఆ పన్నెండు గంట్లోనే చేస్తాడని, తన కోరిక ఈ రోజుకి తాను హాయిగా జీవించడం మాత్రమేనని అన్నాడు. తాను చచ్చాక కచ్చితంగా నరకానికే వెళతాని, అలాంటప్పుడు బతికున్నన్ని రోజులు ఎంజాయ్ చేస్తూ ఇక్కడే స్వర్గాన్ని వెతుక్కుంటాను.
ఈ విషయంపై బాగా క్లారిటీ ఉంది అని చెప్పుకొచ్చారు వర్మ. ప్రస్తుతం రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ సర్కార్ 3. ఇందులో అమితాబ్ బచ్చన్ లీడ్ రోల్ పోషిస్తున్నాడు. గతంలో రెండు భాగాలుగా రిలీజ్ అయిన సర్కార్‌కు సీక్వెల్‌గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు వర్మ.