వర్మ ఈజ్‌ బ్యాక్‌.. కానీ…

277
- Advertisement -

వర్మ ఏది చేసినా సంచలనమే. కాంట్రవర్శికి కేరాఫ్‌ అడ్రస్‌ అయిన రాంగోపాల్‌ వర్మ.. ఇప్పుడు మరో సంచలనానికి  తెరలేపాడు. ‘గన్స్ అండ్ థైస్’ అంటూ ఒక బ్యాంగ్ బ్యాంగ్ వెబ్ సిరీస్‌తో ఆడియెన్స్‌ కి దిమ్మతిరిగిపోయే షాక్‌ ఇచ్చాడు.

బిగ్ స్క్రీన్ మీద చూపించలేని మాఫిలో ఉన్న మరిన్ని కోణాల్ని, వెబ్ సిరీస్‌ ద్వారా చూపించడానికి ట్రై చేస్తున్నాడు వర్మ. రీసెంట్ గా ‘గన్స్ అండ్ థైస్’ అంటూ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు ప్రకటించి ఆశ్చర్యపరిచిన వర్మ..ఆరున్నర నిమిషాల నిడివి ఉన్న ‘గన్స్ అండ్ థైస్’ ట్రైలర్ రిలీజ్ చేశాడు.. నిన్న సాయంత్రం నుంచి ఇదే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. ఈ ట్రైలర్ చూస్తే ‘గన్స్ అండ్ థైస్’ తో వర్మ ఈజ్ బ్యాక్ అన్న ఫీలింగ్ కలుగుతోంది.
 ram gopal varma is back with Guns, thighs
అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో వర్మను నమ్మేలా లేరు ఆయన ఫ్యాన్స్‌. నిజానికి వర్మ హిట్‌ కొట్టి చాలా కాలమైంది. అసలు ఏ టైంలో వర్మ హిట్‌ అందుకున్నాడో కూడా గుర్తులేని పరిస్థితి ఏర్పడింది వర్మ ఫ్యాన్స్‌కి. ప్రస్తుతం వర్మ డై హార్డ్ ఫ్యాన్స్ కూడా ఆయన మీద పూర్తిగా నమ్మకం కోల్పోయిన పరిస్థితి.

దర్శకుడిగా ఆర్జీవీ ప్రమాణాలు ఎంత పడిపోయాయో చెప్పడానికి తాజా రుజువు.. సర్కార్-3. దశాబ్దం కిందట వచ్చిన ‘సర్కార్’ ఫస్ట్ పార్ట్‌ చూసి.. దీన్ని చూస్తే ఈ రెండూ తీసింది వర్మేనా ?అనే డౌట్‌ కలుగుతుంది. ‘సర్కార్-3’కి వచ్చిన రిజల్ట్‌ చూశాక.. వర్మ సినిమాలపై జనాలకు ఎంతగా నమ్మకం పోయిందో అర్థమైంది. ఆయన సినిమాల్ని చూడ్డానికి జనాలు థియేటర్లకు వచ్చే పరిస్థితి లేదని తేలిపోయింది.
  ram gopal varma is back with Guns, thighs
ఇక ఇదే టైంలో ‘గన్స్ అండ్ థైస్’ వెబ్‌ సిరీస్‌ అంటూ…మళ్ళీ ఫ్యాన్స్‌ని అట్రాక్ట్‌ చేసే ప్రయత్నం చేస్తున్నాడు వర్మ. ఇప్పటికే ముంబయి మాఫియా మీద విపరీతమైన ఇంట్రెస్ట్‌.. గొప్ప అవగాహన ఉన్న వర్మ… ఆల్రెడీ ‘సత్య’, ‘కంపెనీ’ లాంటి సినిమాలతో అక్కడి వాతావరణాన్ని వెండితెరపై దిమ్మతిరిగే రేంజ్‌లో చూపించాడు. ఇప్పుడు బిగ్ స్క్రీన్ మీద చూపించలేని  కోణాల్ని వెబ్ సిరీస్‌ ద్వారా చూపించేందుకు రెడీ అయిపోయాడు.

అయితే ఇప్పుడు వర్మ క్రెడిబిలిటీ బాగా పడిపోయిన నేపథ్యంలో ముంబయి మాఫియా మీద ఇప్పుడు ఎంత బాగా సినిమా తీసినా..ఆడియెన్స్‌ని థియేటర్లకు రప్పించడం కష్టమే. కానీ వెబ్ సిరీస్ లో మాత్రం వర్మకి ఆడియెన్స్‌ పిచ్చిపిచ్చిగా ఉంటారు. ఎందుకంటే..వర్మరిలీజ్‌ చేసే ప్రతి వీడియోపై ఖచ్చితంగా ఓ లుక్ వేస్తారు కాబట్టి. ఇక వర్మ కూడా తన క్రియేటివిటీకి హద్దులు పెట్టుకోవాల్సిన పని లేదు. ఆ సంగతి ట్రైలర్లోనే స్పష్టమైంది.
 ram gopal varma is back with Guns, thighs
అమ్మాయిల్ని పూర్తి నగ్నంగా చూపించడానికి.. వయొలెన్స్ తనకు నచ్చిన స్థాయికి పెంచుకోవడానికి వర్మకు స్వేచ్ఛ లభించింది. సెన్సార్ గొడవ లేదు. ట్రైలర్లో చూసిన రా కంటెంట్‌ను ఇష్టపడేవాళ్లు ఆసక్తిగా వెబ్ సిరీస్‌ను చూస్తారు. పదేసి ఎపిసోడ్లతో నాలుగు సిరీస్ అంటున్నాడు కాబట్టి, చాన్నాళ్ల పాటు వర్మ దీనికి ఎంగేజ్ అయిపోయేలా కనిపిస్తోంది.

ఫినాన్షియల్‌గా కూడా బాగానే వర్కవుట్ అయ్యేట్లుంది కాబట్టి అన్ని రకాలుగానూ వర్మకు ఇది మంచి మార్గం లాగే అనిపిస్తోంది. ఏదేమైనా..వర్మ చూపించాలనుకున్న అన్ని కోణాలను సెన్సార్‌ కట్‌ లేని వెబ్‌ సిరీస్‌ ద్వారా చూపించేందుకు ఫిక్స్‌ అయ్యాడు. మరి వర్మ ‘థైస్’ కే ఫిక్సయిపోతాడా లేక ఇకనుంచైనా తన నెక్ట్స్‌సినిమాలతో మునుపటి హిట్‌ని రాబడతాడా? అనేది కూడా చూడాలి.

- Advertisement -