‘ఓ పిల్లా నీ వ‌ల్లా’ స‌క్సెస్‌..

216
- Advertisement -

కిషోర్ స్వీయ‌ద‌ర్శ‌క‌త్వంలో బిగ్‌విగ్‌ మూవీ ఎంట‌ర్‌టైన్మెంట్స్ సంస్థ‌ నిర్మిస్తున్న‌ చిత్రం `ఓ పిల్లా నీ వ‌ల్లా`. కృష్ణ‌చైత‌న్య‌, రాజేష్ రాథోడ్‌, మోనికా సింగ్, షాలు చారసియా న‌టీన‌టులు. ఈ సినిమా మోష‌న్ పోస్ట‌ర్ లాంచ్ ద‌శ నుంచి అద్భుత‌మైన స్పంద‌న అందుకుంది. పూరి జ‌గ‌న్నాథ్‌, శ‌ర్వానంద్ లాంటి క్రేజీ సెల‌బ్రిటీల ఆశీస్సులు ఈ సినిమాకి పెద్ద ప్ల‌స్ అయ్యాయి. ఇటీవ‌ల‌ రిలీజైన ఈ సినిమాకి తెలుగు రాష్ట్రాల్లో ఆద‌ర‌ణ అంతే బావుంది. అన్ని ఏరియాల నుంచి చ‌క్క‌ని స్పంద‌న వ‌చ్చింది. ఈ సీజ‌న్‌లో చ‌క్క‌ని విజువ‌ల్ ట్రీట్ ఈ చిత్రం అంటూ ప్రేక్ష‌కులనుంచి ప్ర‌శంస‌లు అందుతున్నాయి. ఈ సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లో జ‌రిగిన విజ‌యోత్స‌వ వేడుక‌లో..

ద‌ర్శ‌క‌ నిర్మాత కిషోర్ మాట్లాడుతూ – “ఓ పిల్లా నీ వ‌ల్లా.. చ‌క్క‌ని వినోదాత్మ‌క చిత్రమ‌ని తొలి నుంచి చెప్పాం. ల‌వ్‌, కామెడీ, యాక్ష‌న్ హైలైట్‌గా అన్ని వ‌ర్గాల్ని మెప్పించే అంశాలతో తెర‌కెక్కిన ఈ చిత్రం ఇటీవ‌ల రిలీజై విజ‌యవంతంగా ర‌న్ అవుతోంది. న‌వ‌త‌రం న‌టీన‌టుల పెర్ఫామెన్స్‌కి చ‌క్క‌ని గుర్తింపు ద‌క్కింది. ఈ చిత్రానికి అన్ని వ‌ర్గాల నుంచి స్పంద‌న బావుంది. థియేట‌ర్ల‌లో చ‌క్క‌ని ఆద‌ర‌ణ పొందుతోంది. క్లాస్- మాస్ అనే తేడా లేకుండా అన్ని వ‌ర్గాల మెప్పు పొందడం సంతోషాన్నిస్తోంది. ఈ స‌క్సెస్‌తో మ‌రిన్ని చిత్రాల్ని తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించాల‌న్న ఉత్సాహం వ‌చ్చింది. ఇంత‌టి చ‌క్క‌ని విజ‌యాన్ని అందించిన ప్రేక్ష‌కుల‌కు ధ‌న్య‌వాదాలు“ అని తెలిపారు.

O Pilla Nee Valla Movie Success Meet

హీరో కృష్ణ చైత‌న్య మాట్లాడుతూ -“ఓ మంచి కాన్సెప్టు ఉన్న చిత్రంలో అవ‌కాశం క‌ల్పించినందుకు నా ద‌ర్శ‌క‌నిర్మాత‌కు కృత‌జ్ఞ‌త‌లు. కిషోర్ మ‌రిన్ని మంచి సినిమాలు తీయాల‌ని ఆకాంక్షిస్తున్నాను. ప్రేక్ష‌కాభిమానుల‌కు ధ‌న్య‌వాదాలు“ అన్నారు.

మ‌రో క‌థానాయ‌కుడు రాజేష్ రాధోడ్ మాట్లాడుతూ -“ఓ పిల్లా నీవ‌ల్లా టైటిల్‌కి త‌గ్గ‌ట్టే చ‌క్క‌ని ప్రేమ‌క‌థా చిత్రం. ఆద్యంతం వినోదాత్మ‌కంగా సాగే స్టోరిని అంతే అందంగా ద‌ర్శ‌కులు తెర‌కెక్కించారు. ఈ సినిమాలో అవ‌కాశం ఇచ్చినంద‌కు వారికి ధ‌న్య‌వాదాలు“ అన్నారు.

క‌థానాయిక‌లు మాట్లాడుతూ -“ ఓ మంచి చిత్రంలో భాగం అయినందుకు సంతోషంగా ఉంది. సక్సెస్ ఇచ్చిన ప్రేక్ష‌కుల‌కు ధ‌న్య‌వాదాలు. కిషోర్‌ మ‌రిన్ని మంచి సినిమాలు తీయాలి“ అన్నారు.

కృష్ణ‌చైత‌న్య‌, రాజేష్ రాథోడ్‌, మోనికా సింగ్, షాలు చారసియా, సూర్య శ్రీనివాస్ త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రానికి సాహిత్యంః కృష్ణ మ‌దినేని, క‌రుణాక‌ర్ అడిగ‌ర్ల‌, కోరియోగ్ర‌ఫీ :జీతెంద్ర యాక్ష‌న్: మార్ష‌ల్ ర‌మ‌ణ‌, సినిమాటోగ్ర‌ఫీ- షోయబ్ అహ్మ‌ద్ కె.ఎం, ఎడిట‌ర్ః అనిల్ కింతాడ సహా నిర్మాత : మౌర్యా సంగీతంః మ‌ధు పొన్నాస్‌, నిర్మాతః కిషోర్‌, క‌థ‌, స్క్రీన్‌ప్లే, మాట‌లు, ద‌ర్శ‌క‌త్వంః కిషోర్‌

- Advertisement -