మాజీ ప్రధానులపై జోకులేసిన వర్మ…!

305
online news portal
- Advertisement -

రాంగోపాల్‌ వర్మ నిత్యం ఏదో ఒక వార్తలతో హడవుడి చేస్తుంటాడు. ఒకరి ఇష్టాలతో సంబంధం లేకుండా తనకు నచ్చినట్లు చేస్తుంటాడు వర్మ. ఆయన తన ట్విట్టర్‌లో ఎదో ఒక పోస్టుపెట్టి వేరైటీ కామెంట్లతో నెటిజన్లను కంగారుపెడతాడు. అసలే వర్మపై నెటిజన్లు ఇప్పటికే తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఈ సారి ప్రముఖలపై వివాదస్పద వ్యాఖ్యలు చేశాడు వర్మ. పార్లమెంట్‌లో మాజీ ప్రధాని వాజ్‌పేయ్, పీవీ.నరసింహరావు, సోనియా గాంధీ ఉన్న పాత ఫోటోని ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు వర్మ. ఈ ఫోటోలో సోనియా గాంధీ ముందు వరుసలో మిగతా వారంతా ఆమె వెనుక బెంచ్‌‌లో కూర్చొన్నారు. ఈ ఫోటోపై వర్మ తనదైన శైలిలో స్పందించి హడావుడి చేశాడు. బ్యాక్ బెంచర్స్ స్కూల్లోనైనా, పార్లమెంటులో అయినా చెడ్డవారేనని చెప్పుకొచ్చాడు. అంతటితో ఆగని ఈ వివాదాల వర్మ ఫోటోలో కనిపించే ముగ్గురు ఎవరో తనకు తెలియదని.. కానీ ఒకరిని మించి మరొకరు చెడ్డవారిలా కనిపిస్తున్నారని వ్యాఖ్యానించాడు.

ఇదే ఫోటోని రెండోసారి ఫోస్ట్ చేసి.. మహిళలను అగౌరవంగా చూసే భారతీయ పురుషుల స్వభావాన్ని ఈ ఫోటో తెలియజేస్తోందని, ఫోటోలో ఉన్న వ్యక్తులెవరో పోలీసులు విచారణ జరపాలని డిమాండ్ చేశారు రాంగోపాల్‌వర్మ.

అయితే… ఇంతటితో ఆగకుండా అదే ఫోటోని మూడోసారి పోస్ట్ చేసిన వర్మ…. ఫోటోలో ఉన్న ముగ్గురు వ్యక్తులు ఎవరైనప్పటికీ లక్షణంగా, హుందాగా ఉన్న ఓ మహిళపై డర్టీ జోక్స్ వేయడం తనను షాక్‌కు గురిచేసిందని వ్యాఖ్యానించాడు. చిత్రంలో మాజీ ప్రధానులు వాజుపేయ్, పీవీ.నరసింహరావు, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఉండడంతో వర్మ ట్విట్టర్‌…. పోస్ట్‌పై నెటిజన్లు భిన్నమైన రీతిలో స్పందిస్తున్నారు.

ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తులు సోనియాను చూసే నవ్వుతున్నారనే విషయం వర్మకు ఎలా తెలుసని నెటిజన్లు మండిపడుతున్నారు. తనకు తెలిసినవి తెలిసినట్టు చెబితే అందరూ వింటారని, తెలియని వాటి గురించి ఇలా ఊహించి చెబితే విమర్శలపాలవుతారని వర్మను హెచ్చరిస్తున్నారు నెటిజన్లు. అయినా సోనియాగాంధీపై వర్మకు ఇంత ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చిందో తమకు అర్థం కావడం లేదని నెటిజన్లు అంటున్నారు. మహిళలపై రోజుకో అకృత్యం జరుగుతున్నా వాటిపై కనీసం నోరు మెదపని వర్మ, సోనియాగాంధీ విషయంలో ఇలాంటి పోస్ట్ చేశారంటే.. అది కేవలం పబ్లిసిటీ కోసమే తప్ప మరోటి కాదని నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇలాంటి కుళ్లు జోకులు వేయడం రాంగోపాల్‌ వర్మ మానుకోవాలని కొందరు హెచ్చరించారు. ఆ ఫొటోలో ఉన్న ఇద్దరు వ్యక్తులు భారత దేశానికి ఎంతో గర్వకారణంగా నిలిచిన మాజీ ప్రధానులనే విషయం కూడా వర్మకు తెలియకపోవడం ఈ పోస్ట్‌పై ఆయనకున్న మూర్ఖత్వానికి నిదర్శనమని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. వర్మ వ్యాఖ్యలపై ఆయా రాజకీయపార్టీల నేతలు ఏవిధంగా స్పందిస్తారో వేచిచూడాలి మరి.

- Advertisement -