తలైవా స్టైల్‌లో దీపావళి విషెస్‌…

195
- Advertisement -

స్టైల్‌ అంటే రజనీ.. రజనీ అంటే స్టైల్‌.. ఇలా తన బ్రాండ్‌ను ప్రపంచవ్యాప్తంగా పెంచుకున్న రజనీకాంత్‌ అభిమానులకు.. ఆయన కుమార్తె సౌందర్య రజనీకాంత్‌ అభిమానులకు శుభాకాంక్షలు తెలియజేశారు. రజనీకాంత్‌ స్టైల్‌లోనే ఆమె శుభాకాంక్షలు తెలియజేయడం విశేషం. డైనమైట్‌ అంటిస్తూ రజనీ గాల్లోకి విసరగా దీపావళి శుభాకాంక్షలు అంటూ తయారు చేసిన యానిమేషన్‌ చిత్రాన్ని సౌందర్య అభిమానులతో పంచుకున్నారు.

కాగా, ఇటీవల వైద్య పరీక్షలకు అమెరికాకు వెళ్లిన సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చాడు. ఈ ఉదయం రజనీకాంత్ ను పోయస్ గార్డెన్ లోని ఆయన ఇంట్లో చూసిన అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. రజనీ ఫ్యాన్స్ అసోసియేషన్ నేతలు ఆయన్నుదీపావళి సందర్భంగా శాలువాలతో సన్మానించి ఆనందించారు. ఈ సందర్భంగా తాజా చిత్రం, రూ. 300 కోట్ల క్లబ్ లో చేరిన ‘కబాలీ’ 100 రోజుల సెలబ్రేషన్స్ ను సైతం అభిమానులు సందడిగా జరుపుకున్నారు. వచ్చే సంవత్సరం రోబో సీక్వెల్ ‘2.0’ విజయంతో దీపావళిని జరుపుకుంటామని ఈ సందర్భంగా అభిమానులు తెలిపారు. ‌ఇటీవల ‘కబాలి’ చిత్రంతో అభిమానులను అలరించిన ఆయన త్వరలో ‘రోబో-2’ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

- Advertisement -