రామ్‌గోపాల్ వర్మ..ఓ సంచలన దర్శకుడు. ఈయనకు మరో పేరు కూడా ఉంది..వివాదాలకు పెట్టింది పేరు రాంగోపాల్ వర్మ అని. వర్మ ఎక్కువగా తాను తీసిన సినిమాలతో కంటే..వివాదాస్పద వ్యాఖ్యలతోనే కాంట్రవర్శికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచాడనేది వాస్తవం. అయితే వర్మ ఏది చేసినా అది సంచలనమే. ఎప్పుడు ఎవరిమీద మాటల యుద్దం చేస్తాడో తెలీదు. తూటాల్లాంటి మాటలతో విరుచుకుపడడం, ఆ తర్వాత సారీ లు చెప్పడం వర్మకు మాత్రమే సొంతం.
అయితే ఆయన తాజాగా బాలీవుడ్ నటులు టైగర్ ష్రాఫ్, విద్యుత్ జమ్వాల్‌పై ట్విటర్ వేదికగా వ్యాఖ్యలు చేశారు. ఓ మార్షల్ ఆర్ట్స్ అభిమానిగా టైగర్.. విద్యుత్‌లు తలపడితే ఇద్దరిలో ఎవరు గెలుస్తారో చూడాలని ఉందన్నారు వర్మ. టైగర్ ష్రాఫ్ తప్పకుండా విద్యుత్‌ని ఓడిస్తాడని.. టైగర్ సవాల్‌కి విద్యుత్ పారిపోతాడంటూ వరుస ట్వీట్లలో పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే…ఇప్పుడు వర్మ మారిపోయాడంటా. ఇకపై ఎవరినీ కించపరిచేలా ట్వీట్లు చేయనని ఒట్టు కూడా వేశాడు వర్మ. ‘నాకు దేవుడి మీద నమ్మకం లేదు కాబట్టి నా మాటలు మీరు నమ్మకపోవచ్చు. అందుకే మా అమ్మ మీద, దర్శకుడు స్పీల్‌బర్గ్ మీద, అమితాబ్ బచ్చన్ మీద ఒట్టేసి చెబుతున్నాన’ని ట్వీట్ చేశాడు.‘నా వ్యాఖ్యాలతో బాధకు గురైన గణపతి భక్తులకు, పవన్‌కల్యాణ్ అభిమానులకు క్షమాపణలు చెప్పాలనుకుంటున్నానంటూ తెలిపారు వర్మ.
అంతేకాకుండా బాలీవుడ్ నటుడు, మార్షల్ ఆర్ట్స్ నిపుణుడు విద్యుత్ జమాల్ వల్లే తాను మారుతున్నట్టు చెప్పాడు. ఎవరు ఎన్ని చెప్పినా..తాను అనుకున్నదే చేసేసే వర్మ ఇప్పుడు సడన్ గా ఇలా అనేసరికి ఫ్యాన్స్ కూడా నమ్మడానికి రెడీగా లేరనే తెలుస్తోంది.
ఎందుకంటే.. ఇప్పటికే మెగా హీరోలపై కామెంట్స్‌తో విరుచుకు పడ్డ వర్మ..ఇక మెగా ఫ్యామిలీని టచ్ చెయ్యనని చెప్పేశాడు. కానీ అవకాశం దొరికినప్పుడల్లా..వారిపై వర్మ కామెంట్ప్ ఘాటుగానే ఉంటున్నాయి. అయితే ఇప్పటి వరకూ…మాట మీద నిలబడని వర్మ, తాను మారాడని చెప్పుకుంటున్నఈ మాట మీదైనా నిలబడతారో లేదో చూడాలి మరి.