వర్మ అప్పుడే చెప్పాడు..కానీ అఖిల్‌ వినలేదు..!

217
Ram Gopal Varma asks Akhil why he wants to marry early,
- Advertisement -

అక్కినేని అఖిల్‌ పెళ్ళి  అనగానే ఫ్యాన్స్‌  అందరూ తెగ సంబరపడిపోయారు. అక్కినేని నాగార్జునకు ఉన్న బాధ్యతల్లో  తన కుమారుల పెళ్ళి బాధ్యత కూడా తీరిపోతే ఇంకాస్త రిలాక్స్‌ అవ్వొచ్చని అనుకున్నాడు నాగ్‌. కానీ అందరూ అఖిల్‌ పెళ్ళి సంబరాల్లో ఉండగానే…అఖిల్‌ పెళ్ళి క్యాన్సిల్‌ అయిందన్న వార్తలు రాగానే అందరూ షాక్‌ అయ్యారు.  ఇక సోషల్‌ మీడియాలో అయితే ఈ వార్తే ఎక్కువగా హల్‌చల్ చేసింది.

కానీ సంచలన దర్శకుడు రాంగోపాల్‌ వర్మ మాత్రం త్వరలో అఖిల్‌ పెళ్ళి జరగబోతోంది అని వార్తలు రాగానే అఖిల్‌ పెళ్ళిపై భిన్నంగా స్పంధించాడు.  “అఖిల్” కి పెళ్ళి అనగానే, అందరూ ఆహాఓహో అంటే..  రాం గోపాల్ వర్మ మాత్రం తనదైన శైలిలో…అప్పుడే నీకు పెళ్ళేంటి బాస్!! నీ ఏజ్ కి అప్పుడే పెళ్ళవసరమా అని ట్వీట్ చేశాడు..
 Ram Gopal Varma asks Akhil why he wants to marry early,
అప్పుడే అఖిల్‌ పెళ్ళి విషయం పై స్పంధించిన వర్మ  ఇప్పుడు కూడా అఖిల్‌ పెళ్ళి క్యాన్సిల్‌  అయిన విషయం పై … నేనెప్పుడో చెప్పా!! అప్పుడే అవసరమా నీకు అని.. ఇలా ఇప్పటికీ తన మనసులో వర్మ అనుకుంటూ ఉంటాడనడం లో సందేహం లేదు..

ఏదేమైనా.. వర్మ తిక్క సంగతి గురించి పక్కనపెడితే..ఈయన అప్పుడప్పుడు…కాదు కాదు..ఎప్పుడైనా సరే….హార్డ్ గా ఉన్న నిజాలు చెప్పడానికి ఏమాత్రం భయపడడు. నిజం చెప్పాలంటే.. మారుతున్న కాలానికి తగినట్టు వయసు, మెచ్యూరిటీ ఉండాలంటాడు వర్మ. మొత్తానికి  దేశంలో ఉన్న స్వేచ్చని వాక్ స్వాతంత్ర్యాన్ని సంపూర్ణంగా అనుభవించే వ్యక్తి రాం గోపాల్ వర్మ.

- Advertisement -