వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా అమ్మరాజ్యంలో కడపబిడ్డలు. ఆంధ్రప్రదేశ్ లోని ప్రస్తుత రాజకీయాలను ఆధారంగా చేసుకుని ఈసినిమాను తెరకెక్కించారు. కాగా విడుదలకు ముందే ఈసినిమా ఎన్నో వివాదాలు సృష్టించింది. వాస్తవానికి ఈసినిమా నవంబర్ 29న విడుదల కావాల్సి ఉంది. కొన్ని కారణాల వల్ల సెన్సార్ బోర్డు ఈసినిమాకు అనుమతి నిరాకరించింది.
సెన్సార్ అనుమతి ఇవ్వకపోవడంతో సెన్సార్ బోర్డు రివైజింగ్ కమిటీ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. సినిమాలో కొన్ని సన్నివేశాలను కత్తిరించిన సెన్సార్ బోర్డు సినిమాకు సర్టిఫికెట్ ను జారీ చేసింది. ఈవిషయాన్ని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. అమ్మరాజ్యంలో కడపరెడ్లు సినిమాకు లైన్ క్లియర్ అయిందని.. డిసెంబర్ 12గ్రాండ్ గా విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఈసినిమా ట్రైలర్, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
THRILLED💃💃💃 to know there is still freedom of expression in our country ..KAMMA RAJYAMLO KADAPA REDDLU is passed by the CENSOR ..GRAND GALA RELEASE on DEC 12 th 😎😎😎 pic.twitter.com/gTwSoPNL4G
— Ram Gopal Varma (@RGVzoomin) December 7, 2019