చెర్రీ…దసరాకే వస్తున్నాడు…!

199
Ram Charan's Rangasthalam first look on dasara
- Advertisement -

సుకుమార్ దర్శకత్వంలో ‘రంగస్థలం 1985’ షూటింగ్ చాలా వేగంగా జరుగుతోంది. సంక్రాంతి కంటే ముందుగానే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా కోసం భారీ సెట్‌ని వేశారు. చిరుతో సహా జక్కన్న రాజమౌళి సైతం సెట్స్‌కి వెళ్లి చెర్రీ సినిమాకు సంబంధించిన అప్‌ డేట్స్‌తో తెలుసుకున్నారు. ఇక ఇప్పటివరకు ఈ  సినిమాకు సంబంధించి లొకేషన్ కి సంబంధించిన స్టిల్స్ బయటికి వచ్చాయి గానీ, ఫస్టులుక్ మాత్రం రాలేదు. దాంతో అంతా కూడా ఫస్టులుక్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి దసరాకి ఫస్టులుక్ ను వదలడానికి రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. పవన్ చేతుల మీదుగా చరణ్ ఫస్టులుక్ రిలీజ్ అవుతుందని అంటున్నారు. ‘నాయక్’ ఆడియో ఫంక్షన్ తరువాత పవన్ వస్తాడని చెబుతోన్న చరణ్ సినిమా ఇదే.

మరోవైపు వరుస హిట్ సినిమాలతో మంచి జోష్ మీదున్న బన్నీ…తన తర్వాతి చిత్రంపై మరిన్ని ఆశలు పెట్టుకున్నారు. దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కుతున్న నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.2018 ఏప్రిల్ 27న సినిమాను రిలీజ్ చేయనున్నారు. దసరాకి ఫస్టులుక్ ను వదలడానికి ఈ సినిమా టీమ్ రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. చెర్రీ, బన్నీ ఇద్దరు తమ సినిమా ఫస్ట్ లుక్‌తో రాబోతుండటంతో ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు.

- Advertisement -