రివ్యూ : జై ల‌వ‌కుశ‌

313
Jai Lava Kusa Movie Review,..
- Advertisement -

వరుస విజయాలతో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్ తొలిసారి త్రిపాత్రాభినయం చేసిన సినిమా ‘జై లవ కుశ’. కె.ఎస్.రవీంద్ర (బాబీ) దర్శకత్వం వహించారు. తారక్ సరసన నివేదా థామస్, రాశీఖన్నా హీరోయిన్లుగా నటించారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మించిన ఈ సినిమా ఈరోజు (సెప్టెంబర్ 21) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

జై… లవ… కుశ… మూడు పాత్రలలో కనిపించిన జూనియర్ ఎన్టీఆర్ “జై లవకుశ” సినిమా ఎలా ఉంది? తారక్ ను ‘సర్ధార్’ దర్శకుడు బాబీ ఎలా హ్యాండిల్ చేసాడ? అనే విషయాలను తెలుసుకుందాం.

Jai Lava Kusa Promotions in Bigg Boss

కథ:

జై, లవ, కుశ (ముగ్గురు ఎన్టీఆర్‌లు) కవల సోదరులు. జైకి నత్తి. సరిగా మాట్లాడలేడు. లవ, కుశ కూడా జైని చిన్న చూపు చూస్తారు. ఈ కారణంగా చిన్నప్పుడే తన సోదరులపై కోపం పెంచుకొంటాడు జై. అందుకే మిగిలిన ఇద్దరు సోదరులతో కలవలేడు. ప్రమాదవశాత్తూ అన్నదమ్ములు ముగ్గురూ… చిన్నప్పుడే తప్పిపోతారు. లవ కుమార్‌ పెరిగి పెద్దవాడై బ్యాంకు ఉద్యోగిగా స్థిరపడతాడు.

కుశ ఏదోలా మాయ చేసి, అమెరికా వెళ్లి, గ్రీన్‌ కార్డ్‌ సంపాదించి అక్కడే సెటిలవ్వాలని కలగంటాడు. వీరిద్దరి జీవితాల్లోకి ‘జై’ ప్రవేశిస్తాడు. చిన్నప్పటి పగనీ, ప్రతీకారాన్నీ ఎలా తీర్చుకొన్నాడు? తన ఎదుగుదలకు వీళ్లని ఎలా వాడుకొన్నాడు? ఈ ముగ్గురూ కలిశారా? కలిసుంటూనే ఒకరిపై మరొకరు పోరాటం చేశారా? చివరికు ఏం జరిగిందన్నదే మిగిలిన కథ.

ప్లస్‌ పాయింట్స్‌:

ఎన్టీఆర్‌ తప్ప మరో పాత్ర తెరపై కనిపించదు. ‘జై’గా ఎంత భయపెట్టాడో, కుశగా అంతగా నవ్వించాడు. మూడు పాత్రల్లో వైవిధ్యం బాగా చూపించగలిగాడు ఎన్టీఆర్‌. డాన్సులో యథావిధిగా రెచ్చిపోయాడు. రాశీఖన్నా గ్లామరెస్‌గా కనిపించింది. నివేదా పాత్ర కూడా కీలకమే. కావాలని కామెడీ ట్రాకులు జోడించకపోవడం ఈసినిమాకు కలిసొచ్చింది. దేవిశ్రీ సంగీతం ఆకట్టుకొంది.

పాటల్లో కంటే, నేపథ్య సంగీతం విషయంలో చాలా శ్రద్ధ తీసుకొన్నాడు దేవిశ్రీ . అందుకే నేపథ్య సంగీతం ఈ సినిమాకి హైలెట్‌ అని చెప్పొచ్చు. ఇక ‘జై’ పాత్రని ఎలివేట్‌ చేసేలా రూపొందించిన ‘రావణా..’ పాట ఆకట్టుకొంటుంది. బాబి ఎంచుకొన్న కథలో వైవిధ్యం లేక‌పోయినా, ట్రీట్‌మెంట్‌ పరంగా ఆకట్టుకొంటుంది. ఛోటా కె.నాయుడు కెమెరా పనితనం చిత్రానికి అదనపు బలం. కోన మాటలు బాగా పండాయి.

jai lava kusa trailler release

మైనస్ పాయింట్స్‌:

ఎన్టీఆర్‌ బలాలపై బేస్‌ అయిన సినిమా ఇది. అక్షరాలా ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ కోసం తీశారనడంలోనూ ఎటువంటి సందేహం లేదు. ఎన్టీఆర్‌ ఒక్కడే ఈ సినిమాని ముందుండి నడిపిస్తాడు. అయితే..ఈ సినిమా కథ విషయంలో ఫ్యాన్స్‌ కాస్త నిరాశచెందారనే చెప్పాలి. ఎందుకంటే..పాత కథనే కొత్త కోణంలో చూపించే ప్రయత్నం చేశాడు చిత్ర దర్శకుడు. ఫస్ట్ హాఫ్‌తో ఫ్యాన్స్ ని ఉత్సాహపరిచిన కథ.. ద్వితీయార్ధంలో కథ, కథనం కాస్త నెమ్మ‌దిగా సాగుతుంది. దీంతో ప్రేక్షకులు కాస్త ఇబ్బందిపడ్డారనే చెప్పాలి.

సాంకేతిక విభాగం:

ఈ సినిమాను ఎన్టీఆర్ తప్ప మరెవరూ చేయలేరనే విధంగా అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. ఎన్టీఆర్ మేజర్ ప్లస్ పాయింట్ గా చెప్పుకోవాలి. జై, లవ కుమార్, కుశ పాత్రలో మూడు వేరియేషన్స్ చూపించాడు. లవ పాత్రలో చాలా మంచితనంతో ఆకట్టుకోగా, కుశ పాత్రలో తుంటరి వ్యక్తిగా కనిపించాడు. ఈ రెండు పాత్రలు కూడా కాస్త ఎంటర్ టైన్మెంట్ ను అందిస్తూ ఉంటాయి.

కానీ జై క్యారెక్టర్ మాత్రం సూపర్. జై పాత్రలో ఎన్టీఆర్ అదరగొట్టేసాడు. నత్తితో మాట్లాడుతూనే ఎక్కడ విలనిజం తగ్గకుండా బాగా చేసాడు. మిగతా రెండు పాత్రల కంటే జై క్యారెక్టర్ చాలా డిఫికల్ట్ అని చెప్పుకోవచ్చు. ఒక విధంగా చెప్పాలంటే జై క్యారెక్టర్ కు సంబంధించిన రావణ లక్షణాలను సైతం రాజసంగా చూపించాడు తారక్. ఈ సినిమా నటుడిగా ఎన్టీఆర్ ను మరో మెట్టుకి ఎదిగేలా చేసిందని చెప్పుకోవాలి.

 Jai Lava Kusa Movie Review,

ఇక ఈ సినిమాకి గ్లామర్ అయినటువంటి రాశిఖన్నా, నివేదా థామస్ లు వారి పాత్రలకు తగిన న్యాయం చేశారు. ఇద్దరు క్యారెక్టర్లు కూడా చాలా బాగున్నాయి. ఎన్టీఆర్ తో వీరి కెమిస్ట్రీ బాగుంది. ఇక ‘జై లవకుశ’ ఈ ముగ్గురి పాత్రల పక్కన నటించిన ఒక్కొక్క క్యారెక్టర్ హైలెట్ అని చెప్పుకోవాలి. సాయి కుమార్, బ్రహ్మాజీ, ప్రవీణ్… వీరు వారి వారి పాత్రలలో బాగా చేశారు. మిగతా నటీనటులు కూడా బాగా చేశారు.

తీర్పు: ‘జై లవకుశ’ : పక్కా.. ఫ్యామిలీ ఎంటర్ టైనర్..

విడుదల తేదీ: 21/09/2017
రేటింగ్ : 3 2.5/5
న‌టీన‌టులు : ఎన్టీఆర్‌.. రాశీఖ‌న్నా.. నివేదా థామ‌స్‌.. పోసాని కృష్ణ‌ముర‌ళీ.. బ్ర‌హ్మాజీ.. సాయికుమార్‌.. ప్ర‌దీప్ రావ‌త్‌.. జ‌య‌ప్ర‌కాష్ రెడ్డి త‌దిత‌రులు
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్‌
నిర్మాతలు: క‌ల్యాణ్‌రామ్‌, హ‌రికృష్ణ‌
ద‌ర్శ‌క‌త్వం : కె.ఎస్‌. ర‌వీంద్ర‌(బాబి)

- Advertisement -